కాకినాడ: సర్పవరం సీఐ పెద్దిరాజుపై వేటు పడింది. ఆయనను వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న రవికుమార్‌ను నియమించారు. సోమవారం రాత్రి రవికుమార్ సర్పవరం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం మహిళా పీఎస్ఈ పాటు ఎస్పీ కార్యాలయంలోనూ కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగురు పంచాయతీ బండ తిప్పనపల్లి గ్రామంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా అస్లాం 11 టీం శేషాద్రిపురం 11 టీంపై విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతగా నిలిచిన టీంకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VZM: ఉద్యానవన పంటల సాగు ( హార్టికల్చర్ ) ను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కీలక అడుగులు వేస్తోందని గంట్యాడ AO శ్యామ్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న 181 మంది రైతులను గుర్తించామని, ఇప్పటికే బోరు బావులు, మోటార్లు సిద్ధంగా ఉన్న రైతులు వెంటనే ప్లాంటేషన్ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించారు.
నెల్లూరు: కందుకూరు అభివృద్ధికి నుడా సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి రూ. 4.27 కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఇప్పటికే రూ. 21.5 కోట్ల పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఎన్టీఆర్ సర్కిల్-అంకమ్మగుడి రోడ్డుకు రూ. 10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
GNTR: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
GNTR: జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించాలని కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కృష్ణా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇవాళ మోపిదేవిలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
PPM: మహిళా సంఘాల అభివృద్ధికి VAOలు కీలక పాత్ర పోషించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు.ఈ మేరకు ఆమె సోమవారం సాలూరులో సాలూరు, మక్కువ, పాచిపెంట VAOలకు సెల్ ఫోన్లు అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని వారి ఉన్నతికి స్త్రీ నిధి రుణాలను అందజేసినట్లు తెలిపారు.
ATP: పెద్దపప్పూరు మండలంలోని దర్మాపురం, అమ్మలదిన్నె, ముచ్చుకోట గ్రామాల్లో సోమవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఈఓ సుబ్రమణ్యం కౌలు భూముల వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహించగా రూ.7,37,500 ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు.
SKLM: అరసవల్లిలోని జరిగే అసిరి తల్లి సిరి మాను ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక మున్సిపల్ మైదానంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, MLA శంకర్‌తో కలిసి ఉత్సవ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
VZM: గ్రామదేవత పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని DSP ఆర్. గోపాలరావు సూచించారు. సోమవారం సాయంత్రం పాత బొబ్బిలి గ్రామ పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.
మార్కాపురం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సురక్ష చర్యలపై ప్రజలకు వివరించారు. అనంతరం మాక్‌డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. రోగులను ఎలా సురక్షితంగా బయటకు తరలించాలనే అంశాలపై ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.
PLD: నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హన్నుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఎస్పీ కార్యాలయానికి సమీపంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 170 మంది తమ సమస్యలను తెలియజేశారు. వీరిలో కొందరు జువెలరీలో జరిగిన మోసంపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ విచారణకు ఆదేశించారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్ర ఎంతైనా ఉందని టీడీపీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా డీఐజీ కోయా ప్రవీణ్న్ను ఆలయ అర్చకులు కలిసి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. భక్తుల సేవలో తమ బాధ్యతలను నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని డీఐజీ పేర్కొన్నారు.