VSP: వ్యాధుల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. శనివారం సీతమ్మధారలో లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం నూతన తహసీల్దార్‌గా బి. అనురాధ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె డీఎం సివిల్ సప్లై విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తాజా బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాబ్జీ శనివారం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, స్వీకరించారు. సమస్య పరిష్కారించాలని అధికారులతో మాట్లాదారు. రూ.5.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందచేశారు.
అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతితో పాటు రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మూడు రాజధానుల పేరుతో గతంలో కాలయాపన జరిగిందని, ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ప్రకాశం: కొరిసిపాడు మండలం మేదరమెట్ల టౌన్లోనే సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్క్రాప్ నిల్వ ఉంచిన షాపులో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించి అద్దంకి నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ అపాయం జరగలేదు. మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
NDL: బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు మంత్రికి వినతి పత్రాలను అందజేశారు.
GNTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నాయుడును సీఎం చంద్రబాబు కాపాడటం దారుణమన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ELR: కామవరపుకోట మండలం తడుకలపూడి ఎస్సైగా ఇవాళ వల్లి పద్మ బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన SI చెన్నారావు ఇటీవల వీఆర్‌కి బదిలీ ఆయన సంగతి తెలిసిందే. స్టేషన్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. మండల పరిధిలోని అసాంఘిక కార్యక్రమాల నిరోధానికై కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
SKLM: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా వాతావరణం, విద్యార్థుల వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల విన్నపాలను సావధానంగా విన్న ఆమె, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
E.G: భారత చైతన్య యువజన (బీసీ వై) పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఇంటింటికి బీసీ చైతన్యం కార్యక్రమం నిర్వహించారు. బీసీల హక్కుల సాధన కోసం పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరిలో ఆమరణ దీక్ష చేపడుతున్నారని వారు వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని తెలిపారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల కోసం ఉచిత భోజన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఈ నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక నుంచి ప్రతి శనివారం, ఆదివారం యార్డ్ ప్రాంగణంలో ఉచిత భోజనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని పిల్లిగూడ, మాసాడగూడ గ్రామాల్లో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. 240 మంది, 54 వాహనాలు తనిఖీ చేసి, 5 వాహనాలు సీజ్ చేశారు. 350 లీటర్ల నాటు సారా తయారీ ఊటను ధ్వంసం చేసి, అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
KRNL: కోసిగిలో ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థి మృతి చెందడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు కంపాటి నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఆర్టీసీలో ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. MLHP మేడిది అనిత మాట్లాడుతూ.. మానవులలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటలో ‘సి’ విటమిన్ పాత్ర, ఉపయోగాలను, లభ్యమయ్యే వనరులను గురించి విద్యార్థులకు అవాహన కల్పించారు.హెచ్ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ ఆధ్వర్యంలో ‘సి’ విటమిన్ ఉండే పండ్లను పాఠశాలలో ప్రదర్శించారు.