• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చెరువు నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల

ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు తూము ద్వారా సాగునీరును మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, రైతులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో రైతుల భూములకు సాగునీరును విడుదల చేశామన్నారు. చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

April 13, 2026 / 04:40 PM IST

శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

April 13, 2026 / 04:39 PM IST

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 04:38 PM IST

నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్టకు వినతిపత్రం అందజేత

NDL: స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని ఏపీ రెడ్డి సంఘం మహిళ అధ్యక్షురాలు సానం రెడ్డి సుహాసిని కోరారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. రాబోయే తరాలకు ఆయన త్యాగం తెలిసేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరభ రెడ్డి, రమణారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:36 PM IST

ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎస్పీ ధీరజ్

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో మదనపల్లిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజల సమస్యలను నేరుగా విని, కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూవివాదాలపై విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

April 13, 2026 / 04:26 PM IST

పెచ్చులూడుతున్న పైకప్పు.. భయాందోళనలో గ్రామస్థులు

KDP: బి.మఠంలోని ప్రభునగర్ అంగన్వాడీ సెంటర్‌లో 28 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంగన్వాడీ టీచర్ లత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్థులు, సిబ్బంది అధికారులను కోరుతున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

April 13, 2026 / 04:25 PM IST

గొల్లపూడిలో మండల TDP సమావేశం

NTR: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ పార్టీ అని, నాయకులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. గొల్లపూడిలోని అయన కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజలకు పేదరికాన్ని దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపటమే సీఎం చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు.

April 13, 2026 / 04:24 PM IST

కార్యకర్తలతో మంత్రి పయ్యావుల ఆత్మీయ భేటీ

ATP: మంగళగిరిలోని NTR భవన్‌లో జరుగుతున్న క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో కలిసి “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆత్మీయంగా ముచ్చటించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారి అభిప్రాయాలు, క్షేత్రస్థాయి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు.

April 13, 2026 / 04:20 PM IST

భీమవరంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం

W.G: భీమవరంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలను పార ద్రోలడానికి పోలీస్ శాఖతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అల్లు శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ నయామ్ అస్మి మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణపై స్వచ్చంద సంస్థల పని తీరు బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:19 PM IST

‘కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత’

ELR: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సిలికాన్ వ్యాలీకి ధీటుగా ‘క్వాంటం వ్యాలీను సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. భీమడోలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్నత విద్య పేదవారికి అందని ద్రాక్షలా ఉందని, కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వివరించారు.

April 13, 2026 / 04:18 PM IST

మాజీ సర్పంచులకు సన్మానం చేసిన మాజీ డిప్యూటీ సీఎం

PPM: కురుపాం నియోజకవర్గంలోని పదవీకాలం పూర్తి అయిన సర్పంచులను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలి అన్నారు.

April 13, 2026 / 04:11 PM IST

రాష్ట్రపతి ముర్ముకు కూటమి నేతల కృతజ్ఞతలు

CTR: అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి నారా లోకేష్ , చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సహా కూటమి ఎంపీల బృందం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భేటీలో అమరావతి విశిష్టతపై వివరించే బుక్‌లెట్‌ను మంత్రి లోకేష్ సమర్పించారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు విజన్‌ను, భూములు ఇచ్చిన రైతులను అభినందించారు.

April 13, 2026 / 04:10 PM IST

‘సమగ్రశిక్ష ఉద్యోగుల కోసం సహకారాన్ని అందజేయాలి’

VZM: సమగ్రశిక్ష ఉద్యోగుల సంక్షేమం కోసం తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆరికతోట రామకృష్ణ, పి. సింహాచలం తెలియజేశారు. ఇవాళ నెల్లిమర్లలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్రశిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమం నిధిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.

April 13, 2026 / 04:10 PM IST

ఆదోనిలో ముందస్తు అడ్మిషన్లపై ఫిర్యాదు

KRNL: ఆదోనిలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకుడు శ్రీకాంత్ సబ్ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా బలవంతపు చేరికలు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

April 13, 2026 / 04:10 PM IST

గీతాంజలి కుటుంబానికి వైసీపీ ఆర్థిక సహాయం

GNTR: సోషల్ మీడియా ట్రోలింగ్లతో మనస్థాపానికి గురై తెనాలిలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి పిల్లలకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని వైసీపీ నాయకులు అందజేశారు. గతంలో YS జగన్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం తెనాలి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో గీతాంజలి భర్తకు ఈ సాయాన్ని అందజేశారు.

April 13, 2026 / 04:10 PM IST