• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ సమస్యలపై గళమెత్తిన నేతలు

విశాఖ ఆర్టీసీ ఇన్ గేట్ జంక్షన్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి ప్రచారంలో భాగంగా కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏప్రిల్ 14న జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

April 10, 2026 / 12:38 PM IST

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపల్

NDL: మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్లో ఈ నెల 12న జరగనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శుక్రవారం ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

April 10, 2026 / 12:25 PM IST

‘అది అమరావతి కాదు కమ్మరావతి’

VZM: రాష్ట్ర రాజధాని అమరావతి కాదు కమ్మరావతి అని ప్రజలు చర్చించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఈ మేరకు గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణంపై ప్రజలు మేధావులు చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. అలాగే, ప్రభుత్వం సాధ్యమైన పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.

April 10, 2026 / 12:24 PM IST

వంతెన కోసం వినూత్న ఆందోళన

PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి గాజులగూడలో మోకాళ్లపై నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన పూర్తైతే సుమారు 40 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

April 10, 2026 / 12:23 PM IST

రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

TPT: తిరుచానూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా? ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.

April 10, 2026 / 12:12 PM IST

కర్నూలులో మెడికల్ ఉద్యోగుల నిరసన

KRNL: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా, సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్నారు.

April 10, 2026 / 12:12 PM IST

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

CTR: SRపురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లంపల్లికి చెందిన ముగ్గురు బైక్‌పై పుత్తూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

April 10, 2026 / 12:06 PM IST

అర్జీలు స్వీకరించిన పుట్టపర్తి ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులు స్వీకరించారు. విద్య, వైద్యం, పెన్షన్లు వంటి వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

April 10, 2026 / 12:04 PM IST

ఈ నెల 13న నేషనల్ అప్రెంటీస్ మేళా

GNTR: తెనాలి చిన రావూరులోని ప్రభుత్వ ITI శిక్షణ కేంద్రంలో ఈ నెల 13న నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ITI ఉత్తీర్ణులైన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పారు. అప్రెంటిస్ మేళాలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నారు. ITI విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 10, 2026 / 12:01 PM IST

అర్జీలు స్వీకరించిన సోమిరెడ్డి

NLR: తోటపల్లి గూడూరులో ప్రజాదర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనకు అర్జీలు ఇచ్చారు. సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు ఎస్. సురేష్ రెడ్డి, బి. సురేంద్ర పాల్గొన్నారు.

April 10, 2026 / 11:55 AM IST

జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ నియామకం

విశాఖ జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీగా 50వ వార్డు మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జగన్‌కు, జిల్లా అధ్యక్షుడు కె.కె రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

April 10, 2026 / 11:42 AM IST

పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం

VZM: పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే పోషణ్ పక్వాడా కార్యక్రమానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

April 10, 2026 / 11:41 AM IST

నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

NDL: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (RTE) కింద పేద విద్యార్థుల ఉచిత ప్రవేశాల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. చాగలమర్రి విద్యాశాఖ అధికారి న్యామతుల్లా మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాలతో బుధవారంతో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు పొడిగించారు. అర్హులైన విద్జార్థులు ఇవాళ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 10, 2026 / 11:30 AM IST

రేపు మాలకొండలో ధార్మిక సదస్సు

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 10 గంటలకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ఛైర్మన్ దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ధర్మ పరిరక్షణ, ప్రచారం, అభివృద్ధిపై ఆచార్యులు, అర్చక సంఘాలు సూచనలు ఇవ్వనున్నారు. అర్చకుల సమస్యలు కూడా చర్చించనున్నారు.

April 10, 2026 / 11:28 AM IST

పాతమాగులూరులో సోలార్ కాంతులు

బాపట్ల జిల్లా: సంతమాగులూరు మండల పరిధిలోని పాతమాగులూరు ఎస్సీ కాలనీలో ‘పీఎం సూర్య ఘర్’ (ఉచిత విద్యుత్) పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ పవర్ యూనిట్లను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను పరిశీలించారు.

April 10, 2026 / 11:26 AM IST