ATP: జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో జిల్లాలో ట్రాక్టర్ బాడుగలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో గంటకు రూ. 900 లుగా ఉన్న టిల్లర్ బాడుగను ప్రస్తుతం రూ. 1000 కి పెంచారు. ట్రాక్టర్ యజమానులు రకాన్ని బట్టి గంటకు రూ.100 నుంచి రూ. 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ శనివారం కలిశారు. ఇటీవల నియమితులైన పలువురు వేల్పనూరులో ఎమ్మెల్యే గృహానికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, విధులపట్ల అంకిత భావంతో పనిచేసే పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు సూచించారు.
గుంటూరు లాలాపేటలోని పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు కొరిటిపాడు వాస్తవ్యులు యలవర్తి సాంబశివరావు, విజయశ్రీ దంపతులు విరాళం అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో వారు రూ.1,01,116ల విరాళం చెక్కును దేవస్థానం ఛైర్మన్ శ్రీనివాసరావుకు నేరుగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం భక్తులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.
VZM: తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు కోరారు. శనివారం గజపతినగరంలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా డీఈవో క్యాంపన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులకు పిల్లల పాఠశాల ప్రవేశ పత్రాలను అందజేశారు. ఎంఈవోలు విమలమ్మ, సాయి చక్రధర్, పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ప్రారంభించారు. ఏ. క్యాంప్‌లోని డ్రైనేజ్ కాలువల శుభ్రత పనులను పరిశీలించారు. చెత్త, పూడిక తొలగింపు, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
NDL: తిరుమలలో శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం డోన్ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనకాపల్లి డిపోలో ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు శనివారం రెడ్ బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఉద్యోగులపై అధికారులు ఏకపక్షంగా అక్రమ పనిష్మెంట్లు విధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నిబంధనల ప్రకారం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షులు కేఎన్వీ రమేశ్, రీజనల్ సెక్రటరీ పీ.సుధాకర్ పాల్గొన్నారు.
SS: కదిరి STSN డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్‌లో సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ జట్టుతో కలిసి MLA కందికుంట వెంకటప్రసాద్ క్రికెట్ ఆడారు. ఎంత ఒత్తిడి ఉన్నా క్రీడల్లో పాల్గొనడం వల్ల మనోస్థైర్యం లభిస్తుందని చెప్పారు. యువత ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ATP: నార్పల మండల కేంద్రంలో జూన్ 1 నుంచి వెంకట్ వకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ క్రికెట్ పోటీలలో పాల్గొనేవారు ఈరోజు సాయంత్రంలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9704046282 నంబర్లకు సంప్రదించాలన్నారు.
NLR: కలువాయి మండలంలో తల్లిదండ్రులు లేని 12 ఏళ్ల గిరిజన బాలికపై బంధువుల మనవడు (24) లైంగిక దాడికి పాల్పడటంతో 6 నెలల గర్భిణి అయిందని స్థానికులు తెలిపారు. కేసు దాచిపెట్టేందుకు పెద్దలు అబార్షన్‌కు, అధికారుల వద్ద తప్పుడు వయసు సర్టిఫికెట్‌కు యత్నించగా వైద్యులు, MRO నిరాకరించినట్లు సమాచారం. ICDS, సఖీ అధికారులు విచారణ చేస్తున్నా కేసు నమోదు కాలేదని తెలిసింది.
కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 6వ, 7వ వార్డుల్లో శనివారం నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాలువలు, డ్రైన్లలోని పూడికలు, చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ప్రజలు చెత్తను డ్రైన్లలో వేయకుండా పరిశుభ్రత పాటించాలని కమిషనర్ సూచించారు.
GNTR: నందివెలుగు జంక్షన్ నుంచి ఆటోనగర్ వరకు ఉన్న ఆక్రమణలను రూరల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తొలగించారు. రహదారికి ఇరువైపులా హోల్డింగ్స్, అనధికార వ్యాపారాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్లను పోలీస్ రెవెన్యూ, పంచాయతీ అధికారులు కలిసి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. భారీ ఈదురుగాలలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
విశాఖ: మధురవాడ నుంచి రేవల్లపాలెం వెళ్లే 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. టీడీఆర్ జారీ ఆలస్యం కారణంగా 12 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు ఎమ్మెల్యే చొరవతో మళ్లీ మొదలయ్యాయి. మిగిలిన మూడు టీడీఆర్ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అల్లూరి: గిరిజన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రీడల్లో రాణించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో నెల రోజుల పాటు 100 మంది గిరిజన యువకులకు వేసవి క్రికెట్ క్రీడా శిక్షణా కేంద్రాన్ని నిర్వహించామన్నారు. శనివారం ఆ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న యువతను అభినందించారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున 33 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం హర్షనీయమన్నారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే ఆయన నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.