BPT: నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడానికి 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని విశాఖ రేంజ్ ఐజీ గోపీ నాథ్ జెట్టి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డితో ఆయన వీసీలో సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన యువతను తిరిగి సమాజంలో కలపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంకల్పం క్లబ్బులు ఏర్పాటు చేయాలని అన్నారు.
VZM: కొత్తవలస కోటపాడు రోడ్డులో ఉన్న శ్రీ జయదుర్గభవానీ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో ఈనెల 20, 21,12వ, మహాసభ విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద జరుగుతుందని చెప్పారు. మహాసభలను జయప్రద్ధం చేయాలని ఆయన కోరారు. దానికి సంబంధించి గోడ పత్రికను శుక్రవారం విడుదల చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.
ASR: ముంచంగిపుట్టు (M) జర్జుల పంచాయతీకి చెందిన ఒంటరి మహిళ వీ.భీమలమ్మకు కలెక్టర్ టీ.నిశాంతి తక్షణ ఉపాధి కల్పించారు. శుక్రవారం జరిగిన PGRSలో తన పేదరికం, పాప చదువు గురించి భీమలమ్మ మొరపెట్టుకోగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆమెకు నెలకు రూ.6వేల వేతనంతో ‘క్లాప్ మిత్ర’గా నియమించారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఉపాధి కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణా: పెడనలో శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బషీర్ తెలిపిన వివరాల ప్రకారం.. 19వ వార్డు గృహ సముదాయాల మధ్య నిర్వహిస్తున్న జూదంపై దాడి చేసి నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
PPM: పాలకొండ పట్టణంలోని నీళ్ల ట్యాంకు వీధిలో కాలువలు పూడికతో నిండిపోవడంతో, మురుగు నీరు వీధి రోడ్డు పై ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు కష్టంగా మారడంతో పాటు దోమల పెరుగుదల, దుర్వాసన కారణంగా వ్యాధుల భయం నెలకొంది. స్థానికులు వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
CTR: కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
AKP: రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. మునగపాక మండలం చూచుకొండలో శుక్రవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రైతులకు పంటల సాగులో శిక్షణ తరగతులు నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువుల సాగుతో భూములు సారవంతం అవుతాయన్నారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ నెల 19న ఏలూరుకి రానున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అయితే ఇటీవల ఎంపీ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి ఏలూరుకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
E.G: సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు.
VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని కారు ఢీకొన్న ఘటనలో APIIC పంపు హౌస్ కాంట్రాక్ట్ ఉద్యోగి కెల్లి హరిహరరావు తీవ్రంగా గాయపడ్డారు. స్దానికుల వివరాల ప్రకారం రోడ్డు పక్కన నడుస్తుండగా రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు వస్తున్న కారు ఢీకోటట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి ముఖాలను నీళ్లతో కడిగిస్తున్నారు. నిద్రమత్తును వదిలించుకుని, కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని అప్రమత్తంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచిస్తున్నారు.
W.G: రైతులు ధాన్యం విక్రయించే సమయంలో దళారీలను ఆశ్రయించవద్దని, రైతు సేవా కేంద్రంలోనే విక్రయించాలని తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ సూచించారు. శుక్రవారం పెంటపాడు (M) జట్లపాలెం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రక్ షీట్ కోసం ధాన్యం నమూనా 40,600 గ్రాములను RSKలకు తీసుకెళ్లాలన్నారు.
VSP: విశాఖపట్నం నుంచి బయలుదేరే గరీబ్‌రథ్, స్వర్ణ జయంతి, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. జూన్ 18, 19 తేదీల నుంచి ఈ కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
SKLM జిల్లా లో శనివారం ‘స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఈ నెల ‘జలం జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల ను శుక్రవారం ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పునరుద్ధరించాలని సూచించారు