• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పోషకాహార లోపం లేని భారత దేశమే లక్ష్యం’

TPT: పిచ్చటూరు(మం) వేలూరు గ్రామంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, తల్లి, శిశు ఆరోగ్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసోసియేట్ జె. రామకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 15, 2026 / 06:12 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభం

ASR: రంపచోడవరంలో బుధవారం అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు తక్కువ ధరలో భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. కేవలం రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కార్మికులు, విద్యార్థులు, పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

April 15, 2026 / 06:11 PM IST

దేవేంద్రప్పకు టీడీపీలో కీలక బాధ్యత

KRNL: టీడీపీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్పను అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌కు దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

April 15, 2026 / 06:00 PM IST

ఫిరంగిపురంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం

GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన, శుచిశుభ్రమైన భోజనం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

April 15, 2026 / 05:56 PM IST

పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై YCP అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసం కావడం, పలువురు గాయపడటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

April 15, 2026 / 05:50 PM IST

రైతులకు ముద్ర లోన్లు ఇవ్వాలని వినతి

ATP: నార్పలలోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. పాడి పశువులకు, చేతి వృత్తులకు PMJBNLM ముద్ర రుణాలు లబ్ధిదారులకు ఇవ్వాలని, రైతు పాత బకాయిలకు సంక్షేమ ఫలాలు జమ చేయవద్దని ఆయన పేర్కొన్నారు.

April 15, 2026 / 05:50 PM IST

ఏఎస్ఓ పోస్టుకు దరఖాస్తుల గడువు పొడిగింపు

E.G: తూ.గో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల సమర్పణ గడువును మరో 3 రోజులు వరకు పొడిగించినట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి బుధవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఈ పోస్టునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు అప్లై చేసుకోవాలి అన్నారు.

April 15, 2026 / 05:48 PM IST

ఇంటి పన్నులు చెల్లింపులో 5%రాయితీ

ప్రకాశం: పొదిలి పట్టణ ప్రజలకు నగర కమిషనర్ మారుతీరావు మంచి అవకాశం కల్పించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని సూచించారు.

April 15, 2026 / 05:44 PM IST

ఆలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం

KRNL: పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆలూరులో అన్న క్యాంటీన్‌ను ఇవాళ ప్రారంభించారు. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. CM చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతిగా నిలుస్తారని కొనియాడారు. ఈ సౌకర్యం పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.

April 15, 2026 / 05:40 PM IST

జనాభా గణన శిక్షణ తరగతులు ప్రారంభం

కోనసీమ: కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జనాభా గణనపై తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల తహసీల్దార్ వై. రాంబాబు, ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనాభా గణన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వ్యక్తి వివరాలను నిర్దిష్టంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

April 15, 2026 / 05:38 PM IST

‘గురుదత్తకు దాతలు బాసటగా నిలుస్తున్నారు’

GNTR: తెనాలిలో అరుదైన DMD వ్యాధితో బాధపడుతున్న అశ్వర్త్ గురుదత్తకు దాతలు బాసటగా నిలుస్తున్నారు. హరీష్ కుమార్, నవ్యశ్రీ దంపతుల కుమారుడు అశ్వర్త్ కండరాల వ్యాధితో బాధపడుతూ.. సాయం కోసం ఎదురు చూస్తుండటంపై కథనం రావటంతో దాతలు ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండగా, మరికొందరు నేరుగా వెళ్లి తమ వంతు చేయూత ఇస్తున్నారు.

April 15, 2026 / 05:34 PM IST

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా తేజస్విని నియామకం

ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన సంగా తేజస్విని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

April 15, 2026 / 05:32 PM IST

‘స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి’

PPM: కురుపాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కంచుకోటగా మారాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.లేవిడి జంక్షన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని, ప్రతి ఇంటా కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. మండల, పంచాయతీ కమిటీలను వేగవంతం చేయాలన్నారు.

April 15, 2026 / 05:32 PM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే

E.G: అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

April 15, 2026 / 05:23 PM IST

పేలుడు బాధితులకు ఎమ్మెల్యే కందికుంట భరోసా

సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై MLA కందికుంట వెంకటప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

April 15, 2026 / 05:20 PM IST