PLD: క్రోసూరులో కులగణన వలనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలు సక్రమంగా జరుగుతాయని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. సర్వేకి ఇంటింటికి వచ్చే అధికారులకు ప్రజలు సహకరించి వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన అన్నారు. మండల ప్రజలు సహకరించాలని ఎంపీడీవో కోరారు.
W.G: ఆపదలో ఉన్నవారికి మనం ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని ఎంఈవోలు పి. పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రకాశం: కంభంలోని స్థానిక ఆదిఅంధ్ర ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లర్నింగ్ & స్టడీ మదింపు ప్రక్రియను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మదింపు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద ఇవాళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్బీసీ కాలనీలోని కూలిపోయిన దర్గా వద్దకు వెళ్తుండగా బనగానపల్లె పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
VZM: సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాధునిక సాంకేతికతతో రికవరీ చేసిన 10 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్సై గోపాల్ అందజేశారు. గతంలో ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
సత్యసాయి: దేశాభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జనగణన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్వీయ గణనను పూర్తి చేశారు. ప్రజలందరూ బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొని, ఖచ్చితమైన వివరాలను అందించాలని కలెక్టర్ కోరారు. స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.
ELR: బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన జరబాల సాయి రామ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.బాధిత కుటుంబ సభ్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుడికి ఉత్తమ వైద్య సేవలు అందేలా రూ 8,65,000 LOC లెటర్‌ను అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని కోరారు.
PLD: కారంపూడి మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం RWS అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గుంటూరు నగరంలో ఓ జువెలర్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొనగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ATP: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా MLA కాలవ శ్రీనివాసులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఖచ్చితమైన సమాచారం అందిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలే బలమైన పునాది అని వివరించారు. దేశాభివృద్ధికి కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో ప్రతి కుటుంబం పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తూ.గో జిల్లాలో సెన్సస్–2027లో భాగంగా స్వీయ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, వివరాలతో పాటుగా కుటుంబ సభ్యులు వివరాలు కూడా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
KRNL: కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో అక్రమ మద్య రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలపై ఇవాళ బహిరంగ వేలం నిర్వహించారు. కర్నూలు అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేలంలో మొత్తం 15 వాహనాలు అమ్ముడై ప్రభుత్వానికి రూ.59,590 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో పీ & ఇఐ పి.భార్గవ రెడ్డి పాల్గొన్నారు.
NDL: సచివాలయం దగ్గరకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ హరిప్రసాద్ సూచించారు. బేతంచెర్లలోని సచివాలయం-5ను ఇవాళ ఆయన తనిఖీ చేశారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సేవలను అందజేయాలని, అటెండన్స్, ప్రభుత్వం నుండి వచ్చే సర్వేలు, వాట్సాప్ గవర్నెన్స్ గురించి రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నారు. ఆఫీస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
NLR: పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం మారుతీ నగర్ అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలకు ఎలక్ట్రికల్, గ్యాస్, వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం చిన్న పిల్లలు బావులు, చెరువుల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.