• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జీఎంసీకి చంద్రబాబు క్రీడా ప్రాంగణం

GNTR: గుంటూరు కాకుమాను వారి తోటలోని 6.26 ఎకరాల ‘చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం’ ఎట్టకేలకు జీఎంసీకి బదిలీ అయింది. ఏళ్ల తరబడి ఉన్న నిరీక్షణకు తెరపడింది. కార్మిక శాఖ ఈ స్థలాన్ని జీఎంసీకి అప్పగించింది. ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ రవీంద్ర నాని, స్థానికుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 11, 2026 / 09:44 AM IST

పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ బదిలీ

సత్యసాయి: పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఈయనను శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా 18 నెలల నుంచి విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.

April 11, 2026 / 09:32 AM IST

నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు

NDL: మహానంది ఆలయం వెనుక నల్లమల అడవుల్లో మరోసారి అగ్నిమాపక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పలుమార్లు మంటలు వ్యాపించగా అటవీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. శుక్రవారం రాత్రి మళ్లీ మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. అడవుల్లోకి అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 11, 2026 / 09:31 AM IST

పిడుగురాళ్లలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు

PLD: పిడుగురాళ్లలో జరుగుతున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను తహశీల్దార్ జెట్టి మధుబాబు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH. శైలజ సందర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను తహశీల్దార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 09:28 AM IST

భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

అన్నమయ్య: జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సుమారు 50 మంది సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలు, వాహనాల పత్రాలు పరిశీలించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

April 11, 2026 / 09:26 AM IST

తెనాలిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

GNTR: తెనాలిలో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యటించారు. 14వ వార్డులో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న శానిటేషన్ పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో శానిటేషన్ పనులు ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

April 11, 2026 / 09:24 AM IST

విజయవాడలో ఆలయ అధికారులు చర్యలు

NTR: విజయవాడ దుర్గగుడి పరిధిలోని కనకదుర్గానగర్ మరుగుదొడ్లలో గుర్తించిన మృతదేహం ఘటనపై ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. యాచకుడిగా భావిస్తున్న వ్యక్తి మృతి విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన EO శీనానాయక్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రజినీప్రియను తొలగించి, శానిటేషన్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి, నలుగురిని తొలగించారు.

April 11, 2026 / 09:23 AM IST

భూగర్భ జలాలను పెంచేదిశగా ప్రణాళికలు

ASR: జిల్లాలో భూగర్భ జలాలను పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ టీ.నిశాంతి ఆదేశించారు. చెక్ డ్యాంలు, ఫారం పాండ్స్ నిర్మాణాలకు మండలాల వారీగా మ్యాపులను తయారు చేయాలని సూచించారు. శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. దానికి అనుగుణంగా భూగర్భ జలాలను పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.

April 11, 2026 / 09:21 AM IST

‘నిద్రమత్తులో వాహనాలు నడపవద్దు’

ఏలూరు: రూరల్ కలపర్రు టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున పోలీసులు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు నిద్ర మత్తులో డ్రైవింగ్‌ ఎంత ప్రమాదకరమో వివరించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అలసట అనిపిస్తే సురక్షితమైన ప్రదేశాలలో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకోవాలన్నారు. హైవే పై ప్రయాణించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

April 11, 2026 / 09:14 AM IST

శంకరం పంచాయతీ కార్యదర్శిగా ప్రదీప్

AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీ కార్యదర్శిగా ఐ.ప్రదీప్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చోడవరం నుంచి బదిలీపై ప్రదీప్ ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కే.నాగేశ్వరరావు రావికమతం మండలం బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీడీవో కొంకి అప్పారావును మర్యాదపూర్వకంగా కలిశారు.

April 11, 2026 / 09:14 AM IST

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సత్తాచాటిన విద్యార్థి

NDL: జూపాడు బంగ్లా మండలం తర్తూరుకు చెందిన విద్యార్థి కోవిద్ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో ఆల్ ఇండియా 46వ ర్యాంకు సాధించినట్లు శుక్రవారం తండ్రి విశ్వనాథ రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా కోటాలో స్థానం దక్కినట్లు తెలిపారు. దీంతో గ్రామస్థులు, పలువురు విద్యార్థిని అభినందించారు.

April 11, 2026 / 09:12 AM IST

‘సామాజిక మార్పు కోసం జ్యోతిరావు పూలే కృషి’

E.G: సామాజిక మార్పు కోసం కృషి చేసిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని KVPS నాయకులు జువ్వల రాంబాబు పేర్కొన్నారు. శనివారం నిడదవోలులో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. కుల రహితం, సమాజ హితం, సమభావన లక్ష్యంతో ముందుకు వెళ్లడమే ఫూలేకు నిజమైన నివాళి అని అన్నారు.

April 11, 2026 / 09:12 AM IST

యువకుడిపై దాడి.. ఆరుగురిపై కేసు

CTR: ఎస్ఆర్ పురం మండలం యువకుడి ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన మధుబాబుపై అర్ధరాత్రి 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ఆరుగురి యువకులు దాడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

April 11, 2026 / 09:11 AM IST

మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా

KDP: కమలాపురం క్రాస్ రోడ్ వద్ద తాడిపత్రి జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇవాళ నడిరోడ్డుపై పడుకుంటూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించాడు. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనను వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం సేవించి ప్రజా రహదారులపై అల్లరి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.

April 11, 2026 / 09:10 AM IST

వారధిపై రాకపోకలను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఓటు విలువ ఈరోజు అభివృద్ధిగా మీ ముందు ఉందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై రాకపోకలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఓఎన్జీసీ సీఎస్సార్ నిధులు రూ.61 లక్షలతో ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించారు. దీంతో పాటు వారధిపై సోలార్ లైట్లు బిగించారు.

April 11, 2026 / 09:10 AM IST