E.G: నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం తెలిపారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ఆకాంక్షించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో వేసవి వరి పంటను పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొండవాగుల నుంచి వచ్చే సహజ జలాలను వినియోగిస్తూ నీటి కొరత మధ్య కూడా పంటలను సాగు చేస్తున్నారు. కష్టపడే తత్వం, ప్రకృతితో అనుసంధానం గల జీవన విధానం గిరిజనుల ప్రత్యేకతగా నిలుస్తోంది. వారి కృషితో పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.
KDP: ఒంటిమిట్ట మండలంలోని కుడమలూరులో ఇవాళ అంకాలమ్మ తిరునాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ వివరించింది. గ్రామానికి బంధువులు, మిత్రులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.
AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
VZM: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. అందులో భాగంగా విజయనగరం టౌన్ ఇంచార్జ్ డీఎస్పీ, దిశా డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గోవిందరావును బొబ్బిలి డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు అదే స్థానంలో విధులు నిర్వహించిన భవ్యారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో చీపురుపల్లి డీఎస్పీగా పనిచేస్తున్న రాఘవులును బొబ్బిలి ఇంచార్జ్ డీఎస్పీగా వ్యవహరించారు.
KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ డా. ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముగ్గురు ఉభయ దాతలు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు దాతలకు తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
కృష్ణా: కృత్తివెన్ను మండల టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న అందజేశాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ప్రకాశం: సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మకు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్: విశాఖపట్నం-లోకమాన్య(నం.18519/20) తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్ రైళ్లను నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ సమయంలో ఖాజీపేట జంక్షన్‌లో స్టాప్‌ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
KDP: బద్వేలు పురపాలికలోని నెల్లూరు రోడ్డులో రాచ పూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్లు కళాశాల ఏవో సాయికృష్ణ తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య శస్త్ర చికిత్సలు నిర్వహణ, మందులు, అద్దాల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TPT: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు. జీవకోన ప్రాంతంలోని రాఘవేంద్ర నగర్ కూడలి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చిన్నంగారి షణ్ముగం(49)ను అరెస్టు చేసి అతని బ్యాగ్‌లో ఉన్న నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.
CTR: తవణంపల్లి మండలంలో టోకెన్లు పొందిన మామిడి రైతులకు ఇవాళ, రేపు ఉదయం 10 గంటలకు దిగువమాఘం సొసైటీ భవనం వద్ద కవర్లు పంపిణీ చేయనున్నారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లోనే రావాలని అధికారులు కోరారు. కవర్లు లూజ్‌గా ఉండే అవకాశం ఉన్నందున సంచులు తీసుకు రావాలని హార్టికల్చర్ అధికారిణి సాగరిక సూచించారు.
ATP: జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.190, స్కిన్ లెస్ రూ.210, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.220 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.220 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీ పై రూ. 20 నుంచి 30 ధరలు తగ్గాయన్నారు.
KKD: మండిపోతున్న ఎండలవేళ ప్రజలకు ఊరటనిచ్చేందుకు నగరంలోని 16 ప్రధాన కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇవాల్టి నుంచి అన్ని చలివేంద్రాలు పని చేస్తాయన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.