• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీసీ డిమాండ్లకు సంఘాల మద్దతు

కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీ చేపట్టిన బీసీల 5 డిమాండ్లకు బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం మద్దతు తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, కులగణన, 44% రిజర్వేషన్లు వంటి డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 11న ఆమరణ దీక్షను విజయవంతం చేయాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 9, 2026 / 06:29 PM IST

‘శాశ్వత లోక్ అదాలత్ వినియోగించుకోండి’

VZM: ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన తగాదాలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కోర్టులో శాశ్వత లోక్ అదాలత్‌పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకింగ్, బీమా, విద్యాసంస్థలు, ఆస్తి, ఉపాధి హామీ పథకం, రవాణా, పోస్టల్, విద్యుత్, నీటి సరఫరా తదితర వాటిని రాజీ చేసుకోవాలన్నారు.

April 9, 2026 / 06:27 PM IST

షెడ్యూల్డ్ కులాల కమిషన్ సమీక్ష సమావేశం

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి జిల్లా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల అందుబాటు వంటి అంశాలపై చర్చించారు.

April 9, 2026 / 06:26 PM IST

అనంతపురం అగ్రగామిగా ఉండాలి: ఛైర్మన్

ATP: వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలవాలని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఓ.ఆనంద్‌తో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధిస్తూ మానవ వనరుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.

April 9, 2026 / 06:10 PM IST

పిచ్చటూరులో పోషణ పక్వాడా ప్రారంభం

TPT: తిరుపతి జిల్లా పిచ్చటూరు ICDS పరిధిలోని గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో “పోషణ పక్వాడా” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. సీడీపీవో సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పిల్లల సమగ్ర అభివృద్ధి, పోషకాహారంపై అవగాహన పెంపొందించాలని సూచించారు.

April 9, 2026 / 06:03 PM IST

పోషణ్ పక్వాడపై గర్భిణీలకు అవగాహన

సత్యసాయి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడా పేరుతో పదిహేను రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. అందులో భాగంగా రొళ్ల మండలం వన్నారన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు వివిధ అంశాలను వివరించారు. సంపూర్ణ పోషణ, పిల్లల ఎత్తు, బరువుల నమోదు, రక్తహీనత నివారణ, పారిశుద్ధ్యం, వర్షపునీటి నిల్వ తదితర అంశాలపై అవగాహన కల్పించారు

April 9, 2026 / 06:00 PM IST

‘ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేయాలి’

PLD: జిల్లాలో ప్రతి అర్హుడైన రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

April 9, 2026 / 05:54 PM IST

రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎంపీడీవోకు వినతి

ATP: నార్పల మండలం మడుగుపల్లి క్రాస్ నుంచి గూగూడు వరకు గల 4 కిలోమీటర్ల పంచాయతీ రోడ్డును బాగుచేయాలని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్య దర్శి కుళ్లాయప్ప కోరారు. ఈ మేరకు ఎంపీడీవో మమత దేవికి వినతి పత్రం ఇచ్చారు. గూగూడు కుల్లాయిస్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం నూతన రోడ్డు వేయాలని విన్నవించారు.

April 9, 2026 / 05:50 PM IST

‘పంచాయతీ ఎన్నికలలో గెలుపు కృషి చేయాలి’

ELR: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్యాలయంలో పలువురు నేతలతో హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై వారితో సమీక్షించారు. నియోజవర్గంలో పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతలు ఉండడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ , ఎన్నికలలో గెలుపు కోసం పరిచేయాలన్నారు.

April 9, 2026 / 05:50 PM IST

‘నీటి సంరక్షణకు 100 రోజుల చర్యలు’

KRNL: జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం 100 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ డా.సిరి గురువారం ప్రారంభించారు. కోసిగి మండలం డి.బెలగల్‌లో చెక్‌డ్యామ్, నాగమ్మ చెరువును పరిశీలించి వాగులు, వంకల అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. భూగర్భ జలమట్టాన్ని 6.6 మీటర్ల నుంచి 4 మీటర్ల లోపు తగ్గించడమే లక్ష్యమని, 246 చెరువులు పునరుద్ధరిస్తామని కలెక్టర్ తెలిపారు.

April 9, 2026 / 05:46 PM IST

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.

April 9, 2026 / 05:41 PM IST

‘సూర్యఘర్ సోలార్ పనులు వేగవంతం చేయాలి’

KDP: మైదుకూరు విద్యుత్ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై చేపట్టిన సోలార్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని, పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నివారించాలని, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

April 9, 2026 / 05:40 PM IST

రాయచోటిలో సెమినార్‌కు ప్రత్యేక ఆకర్షణ

అన్నమయ్య: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో హాజరయ్యారు.

April 9, 2026 / 05:35 PM IST

రీ సర్వేను పరిశీలించిన ఆర్డీవో ఆనంద్ కుమార్

సత్యసాయి: గుడిబండ మండలంలలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ పర్యటించారు. మండలంలోని చిగాతుర్పి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను రైతుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం సర్వేయర్లతో మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సర్వే చేయాలన్నారు. రైతులకు రీసర్వే గురించి వివరించారు.

April 9, 2026 / 05:30 PM IST

కార్యకర్తలతో మాజీ మంత్రి శైలజనాథ్ సమావేశం

ATP: శింగనమలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

April 9, 2026 / 05:30 PM IST