• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ సర్పంచ్‌కు సన్మానం

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మాజీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్, ఉప సర్పంచ్ కిషోర్‌లకు ఆర్టీసీ షాప్ ల యూనియన్ సభ్యులు ఎద్దు మురళి, నారా సురేష్, నెమలిపురి మురళి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి వ్యాపారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి సేవలను ప్రశంసించారు.

April 22, 2026 / 01:00 PM IST

కంచాలమ్మ గండి చెరువును పరిశీలించిన మంత్రి

అన్నమయ్య: జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మాండవ్య నది శుభ్రత, చెక్‌డ్యాముల నిర్మాణం, సప్లై ఛానల్ మరమ్మతులతో నీటి నిల్వ పెంచాలని మంత్రి సూచించారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

April 22, 2026 / 12:48 PM IST

మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీ

సత్యసాయి: పరిగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీతోపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. శక్తి యాప్, 100, 112 వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

April 22, 2026 / 12:43 PM IST

భానుడి ప్రతాపం.. ఇంట్లో జనం

ATP: జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి వేడి గాలులు మొదలై, రాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతోంది. ఎండల ధాటికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

April 22, 2026 / 12:39 PM IST

చురుగ్గా తాండవ రహదారి నిర్మాణ పనులు

AKP: నాతవరం నుంచి తాండవకు వెళ్లే 7 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు అధ్వాన్నంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ.3.5 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణం వేగవంతం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 22, 2026 / 12:29 PM IST

లాడ్జీల్లో పోలీసుల దాడులు

KDP: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రి పెట్రోలింగ్‌ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో దాడులు, తాళాలు వేసిన ఇళ్ల వద్ద నిఘా పెంచారు. అనుమానాస్పద సమాచారం ఉంటే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

April 22, 2026 / 12:27 PM IST

గురుకుల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల విజయకేతనం

ప్రకాశం: శానంపూడి ZPHS సింగరాయకొండ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో విజయకేతనం ఎగరవేశారు. ఏకంగా 11 మంది విద్యార్థులు 5వ తరగతి సీట్లు సాధించి రికార్డు సృష్టించడం విశేషం. ఉపాధ్యాయులు, న్యాయవాది వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు బుధవారం పాఠశాలలో ప్రతిభచూపిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘన విజయంపై స్థానికులు గర్వపడుతున్నారు.

April 22, 2026 / 12:27 PM IST

వాకర్స్‌పై యూజర్ చార్జీలు రద్దు చేయాలి: సీపీఐ

VSP: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా జరిగింది. పార్కులు, స్టేడియాల్లో వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీలు విధించడం ప్రజా వ్యతిరేకమని జిల్లా కార్యదర్శి ఎస్‌కె రహమాన్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

April 22, 2026 / 12:25 PM IST

కలిగిరికి నూతన సీఐ బాధ్యతలు స్వీకరణ

NLR: కలిగిరి సీఐ పి.వెంకటనారాయణను రేంజ్ వీఆర్‌కు బదిలీ చేస్తూ గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇవాళ వెంకటాచలం సీఐ పి.సుబ్బారావును కలిగిరి సీఐగా నియంచారు. సీఐను వీఆర్‌కు బదిలీ చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.

April 22, 2026 / 12:14 PM IST

బాధితులకు ఆర్థిక సాయం అందజేత

ELR: ముసునూరులో ఇళ్ళు అగ్నికి ఆహుతైన ఘటనలో బాధితులకు అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వెంకట రవీంద్ర బుధవారం ఆర్థిక చేయూత అందించారు. నిత్యవసర సరుకులు,10 వేల రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి నరసింహారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నేత కొండేటి ఉదయ్ కిరణ్, చీలి అర్లప్ప, లక్కపాము కాంతారావు పాల్గొన్నారు.

April 22, 2026 / 12:13 PM IST

కొత్తపోలమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే

PPM: ఈ నెల 26 నుంచి 29 వరకు కొత్తవలసలో శ్రీ కొత్త పోలమ్మ అమ్మవారి పండగ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇవాళ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పండగలో చేపట్టనున్న ఘటాల ఊరేగింపునకు రావాలంటూ స్థానిక MLA బోనెల విజయచంద్రను ఆయన కార్యాలయంలో కలసిన ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసారు.

April 22, 2026 / 12:06 PM IST

గ్రామీణ యువతులకు ఉచిత నైపుణ్య శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో యువతులకు బ్యూటీ పార్లర్, కుట్టు పనిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. మే 6 ప్రారంభమయ్యే ఈ 35 రోజుల కోర్సులో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు 97105091727, 9391486269 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.

April 22, 2026 / 12:06 PM IST

పుల్లలరేవులో కొత్త రహదారుల ప్రారంభం

ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పుల్లలరేవు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రూ.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అలాగే గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకు రూ.1.30 కోట్ల ఏపీఆర్‌ఆర్‌పీ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.

April 22, 2026 / 12:02 PM IST

ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం

AKP: ప్రజలకు మెరుగైన పాలన, అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో సింగపూర్ లో పర్యటిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండవ రోజు సింగపూర్ హోం మమంత్రి షణ్ముగంతో సమావేశమై శాంతిభద్రతల నిర్వహణ, చట్టాలు అమలుపై చర్చించడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రణాళికలు, భూపాలనపై శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆ దేశ 50 ఏళ్ల ప్రగతిని అధ్యాయం చేస్తున్నట్లు చెప్పారు.

April 22, 2026 / 12:01 PM IST

చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలి: డాక్టర్

CTR: వేసవిలో ఎండ తీవ్రతతో చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ అలసట, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్ చిన్న పిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. బుధవారం అయన మాట్లాడుతూ.. పిల్లలకు దాహం వేయకపోయినా తరచూ మంచి నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, లేదా పండ్ల రసాలు ఇస్తుండాలన్నారు. జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.

April 22, 2026 / 12:01 PM IST