ప్రకాశం: గిద్దలూరు (మం) అంబవరం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో శ్రీ కే. సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆయన, పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఐటీయు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, కనీస వేతనాల అమలు, లేబర్ కోడ్ల రద్దు కోసం సీఐటీయు నిరంతరం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
VZM: గత 40 రోజులుగా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను అభినందించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు.
CTR: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక శాస్త్ర పరీక్ష ముగిసింది. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షకు మొత్తం 3,461 మంది విద్యార్థులకు గాను 3,128 మంది హాజరయ్యారని, 513 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. అలాగే, ఇదే రోజు జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మరో 18 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
KDP: సీ.కే.దిన్నె మండల కేంద్రంలోని PHCని శనివారం ఇంచార్జ్ DMHO డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాతృ-శిశు సంరక్షణ, వంద శాతం ప్రభుత్వ ప్రసవాలు, చిన్నారుల టీకాలు, సీజనల్ వ్యాధుల నివారణ, బయోమెట్రిక్ హాజరుపై సూచనలు చేశారు.
అనకాపల్లి జిల్లాలో వివిధ దేవాలయాల్లో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో DSP మాట్లాడుతూ.. నిందితుడు జి. రాజుతో పాటు మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా స్థానిక దేవాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.4.45 లక్షల విలువైన ఆస్తిని చోరీ చేసినట్లు గుర్తించామన్నారు.
సత్యసాయి: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ మహానాడులో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను నేతృత్వంలో వందలాది మంది మహిళలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు.
విశాఖలోని జగదాంబ జంక్షన్ రమేష్ ఫంక్షన్ హాల్లో శనివారం దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో BLAలకు SIRపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు, జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పాల్గొని BLAలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఓటరు జాబితా ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలోని లిమ్మక వీధిలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఓ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. ట్యాంక్ దెబ్బతినడంతో నీరు వృథాగా పోగా, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
SKLM: మందస మండల దళితుల సమస్యలు పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కొంకడాపుట్టి గ్రామంలో దళిత మహిళ భూమి ఆక్రమణ, లోహరిబందలో దళితులకు కేటాయించిన భూముల ఆక్రమణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
KRNL: సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పదవి వీరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వారి సేవలను అభినందిస్తూ.. శాలువ, పూలమాలతో సత్కరించి, బహుమతులను అందజేశారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా ఎస్పీని సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు.
PLD: అమరావతి మండలంలో ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష రాసేందుకు 145 మంది విద్యార్థులు శనివారం హాజరయ్యారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు ఇబ్బందులకు గురయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వివిధ వాహనాల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు.
BPT: చీరాలలో లలిత కళాసమితి 74వ వార్షికోత్సవాన్ని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కళల అభివృద్ధికి సమితి అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా సభ్యులను అందె మురళీవర ప్రసాద్, జూనియర్ డీ.వీ. సుబ్బారావు, కళాకారిణి అమృతవర్షిణిలను సత్కరించారు.
NTR: కంచికచర్ల(M)కొత్తపేట గ్రామంలో మాస్టర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని పలు కుటుంబాల వివరాలను అధికారులు పరిశీలించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని ధృవీకరించారు. ఇంటింటికీ వెళ్లి ఆధార్, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించారు.
W.G.రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వరి కంకెలతో విశేష అలంకరణ చేశారు. క్షేత్ర ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు, అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.