సత్యసాయి: కదిరి పట్టణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NLR: రేపు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,12,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 198 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 12 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2084 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.
కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో టీడీపీ టౌన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పండ్రాజు సాంబయ్య, ఇతర కమిటీ సభ్యులతో, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాలను అందజేశారు. నేడు ప్రమాణస్వీకారం చేసిన నాయకులు పదవులను బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే రాము అన్నారు.
SKLM: పోలాకిలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పోలాకిలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న అటవీ భూముల సమస్య వలన మత్స్యకారుల ఇబ్బందులు పడుతున్నట్లు నరసన్నపేట MLA రమణమూర్తి జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ జేసీ రెవెన్యూ, అటవీ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు.
NTR: విజయవాడ రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న రేషన్ డీలర్ల అధ్యక్షుడు కాగిత కొండాను మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాగిత కొండాకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. దేవుడి దయతో కాగిత కొండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
VSP: APSRTC రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్లో పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కోసం ఇండోర్ ప్లాంట్స్ పెంపొందిస్తున్నామని తెలిపారు. బెంచీలు, కుర్చీలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీటీఎం కె.పద్మావతి, ఏటీఎం బాపిరాజు, ఏఎం ఎస్ఎస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ASR: పిల్లల్లో పోషణ, ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై దృష్టి సాధించాలని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాజేంద్రపాలెం సెక్టార్ పరిధిలోని రేవళ్ల గ్రామ సచివాలయంలో 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు స్థానికంగా లభ్యమయ్యే పౌష్టికాహార విలువలు గురించి అవగాహన కల్పించాలన్నారు.
NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం బుచ్చి, కోవూరు మండలాలలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బుచ్చిలో అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొంటారు. అనంతరం పంచాయతీ బెల్లకూరు కాలనీ నందు నూతనంగా నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, స్వర్ణాంధ్ర-2047 విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
TPT: శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్గీయ శ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఏప్రిల్ 15న చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బొజ్జల జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించి, ఆయన ఆశయాల బాటలో ముందుకు నడవాలని సూచించారు.
PPM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. కృష్ణప్రసాద్ సోమవారం పార్వతీపురం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, సౌకర్యాలను పరిశీలించి, వారి హక్కులపై అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, జైలు రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.
KKD: జగ్గంపేట కాకినాడ-గోకవరం ప్రధాన రోడ్డుపై అక్రమ పార్కింగ్‌పై ఎస్సై రఘునాథరావు సోమవారం కఠిన హెచ్చరిక జారీ చేశారు. దుకాణాలకు వచ్చే వారు బైకులను రోడ్డుకు దిగువ భాగంలో పార్క్ చేయాలని, తోపుడుబండ్ల వర్తకులు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అడ్డులేకుండా వ్యాపారం సాగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ASR: జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లు, మధ్యాహ్న భోజన కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలకు అంతరాయం లేకుండా డిపోల నుంచి సరుకులను చేరవేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. అందులో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సరుకుల సరఫరాకు జియో ట్రాకింగ్ తో కూడిన వాహనాలను, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలన్నారు.
కోనసీమ: కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దళిత యువకుడు నాగబత్తుల సుధీర్ ఇటీవల విద్యుత్ షాక్ కు గురై కుడి చేయి కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధితుడిని పరామర్శించి, నాయకులు, కార్యకర్తల తరపున రూ.1,00,500 నగదు సహాయం అందించారు. ఎల్లప్పుడు అండగా ఉంటావని బాధితుడికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: కదిరికి చెందిన ఎం. చరణ్ కుమార్ గుండె శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సోమవారం ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి మంత్రి చొరవతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి పునర్జన్మ లభించింది. ఈ సందర్భంగా చరణ్ కుమార్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.