• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ చేతులమీదుగా ఎంపీడీఓ కు సత్కారం

PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబరులో భామిని MPDO ఎస్‌.వసంత కుమారిని శాలువాతో సత్కరించారు. సంపూర్ణత అభియాన్‌ 2.0 సక్సెస్‌ మీట్‌లో భాగంగా ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో సంపూర్ణత అభియాన్‌ 2.0 విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యత వహించినందుకు సత్కరించినట్టు తెలిపారు.

April 14, 2026 / 06:49 AM IST

నేటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

SKLM: శ్రీకాకుళం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు మంగళవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి కె. మోహనరావు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ప్రజలు భాగస్వామ్యులై, విజయవంతం చేయాలని కోరారు.

April 14, 2026 / 06:49 AM IST

రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు

VSP: జీవీఎంసీ 78వ వార్డు ఉక్కునగరంలో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నిర్వహించనున్నట్టు వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్, ఫోటో మార్పిడి వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని వార్డు సచివాలయంలో జరిగే సేవలను వినియోగించుకోవాలన్నారు.

April 14, 2026 / 06:34 AM IST

తాడేపల్లిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట రామన్నగూడెంలో సోమవారం సాయంత్రం దయ్యాల సూర్యనారాయణను అదే గ్రామానికి చెందిన కిషోర్ కిటికీ అద్దంతో మణికట్టుపై కోసి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 06:30 AM IST

మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే

అనంతపురంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. హైదరాబాద్‌లోని ఏఎల్ఈఏపీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ రమాదేవిని ఆయన కలిశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కు అందుబాటులో ఉందని, కొత్తగా పరిశ్రమలు స్థాపించే మహిళలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు.

April 14, 2026 / 06:29 AM IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత

KRNL: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సోమవారం అత్యధికంగా కర్నూలులో 43, నంద్యాల, కడప, విజయవాడ, గుంటూరులలో 42 డిగ్రీల వేడి నమోదైంది. అనంతపురం, గోదావరి జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

April 14, 2026 / 06:27 AM IST

కారు భీభత్సం.. ఒకరు మృతి

NDL: శ్రీశైలం పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇనుప గేటును కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం దర్శనానికి హైదరాబాద్ నుంచి 9 మంది భక్తులు వెళ్లారు. కాగా, కుక్కను తప్పించబోయి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

April 14, 2026 / 06:18 AM IST

ఈ నెల 16 నుంచి ఈట్ స్ట్రీట్ దుకాణాలు ప్రారంభం

తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన వ్యాపారులు ఈ నెల 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తాళాలు అందజేసి నిబంధనలు వివరించారు. కేటాయించిన ఆహార పదార్థాలనే విక్రయించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 14, 2026 / 06:16 AM IST

నేటి నుంచి జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు

CTR: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. 6 రోజులపాటు ఈ వారోత్సవాలు జరుగుతాయని చెప్పారు.

April 14, 2026 / 06:16 AM IST

విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

విశాఖలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు 2,474 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకపోవడం-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్-112, ఓవర్ స్పీడ్-223, సెల్‌ఫోన్ వినియోగం-19, లైసెన్స్ లేకపోవడం-6, మైనర్ డ్రైవింగ్-2, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవ్-47, ఎంవీ యాక్ట్ ఉల్లంఘనలు-501 కేసులు నమోదయ్యాయి.

April 14, 2026 / 06:15 AM IST

పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి

SKLM: శ్రీకాకుళం నగరం అరసవల్లిలో త్వరలో జరగబోయే ఆసిరి తల్లి సిరిమాను పండుగ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం సాయంత్రం పరిశీలించారు. అరసవల్లి అమ్మవారి ఉత్సవాల పై సమీక్ష నిర్వహించారు. అనంతరం అరసవల్లిలోని పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆయనతో పాటు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:12 AM IST

వీఏఓ లకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం గంట్యాడ మండలం రామవరం గ్రామంలో గజపతినగరం నియోజకవర్గంలోని VAO లకు సెల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్‌ ఫోన్లు ప్రభుత్వం అందించడం వలన పొదుపు సంఘాలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రజలకు, పొదుపు సంఘాలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

April 14, 2026 / 06:05 AM IST

3 కేజీల గంజాయితో ముగ్గురు నిందితులు అరెస్ట్

SKLM: శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల పై ఎస్సై‌హరి కృష్ణ సోమవారం తనిఖీలు చేశారు. నాగావళి నది ఒడ్డున అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

April 14, 2026 / 06:03 AM IST

ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్నక్యాంటీన్

ప్రకాశం: సింగరాయకొండలో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధమైంది. సింగరాయకొండ నుంచి కందుకూరు వెళ్లే రోడ్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంటీన్ సమీపంలో ప్రభుత్వ వైద్యశాల ఉండటం పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

April 14, 2026 / 05:32 AM IST

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి: YCP అధ్యక్షుడు

ATP: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులు ఆయనను కలిసిన సందర్భంగా అనంత మాట్లాడారు. అందరూ సమష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

April 14, 2026 / 05:31 AM IST