• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు

AKP: ఎలమంచిలి పట్టణం జలాల వీధిలో కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్దురాలిపై శనివారం కోతులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి గాయం అయింది. గత కొంతకాలంగా ఎలమంచిలి పట్టణంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతులతో పుర ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. నేరుగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేస్తూ పాడు చేస్తున్నాయి.

April 5, 2026 / 06:36 AM IST

30 గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వీరే

SKLM: ఆమదాలవలస మండలం పరిధిలోని 30 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకా ధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నియమించారు. ప్రత్యేకా ధికారులుగా వీరే – తోటాడ ఎస్. రామ్మోహన్ రావు (ఎంపీడీఓ), రామచంద్రాపురం- ఎస్. రాంబాబు (తహసీల్దార్), కొర్లకోట, తోగరాం ఎం .మోహన్ రావు (ఏవో ) వంజంగి, వంజంగి పేట ఏ .గోపాలరావు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్నారు.

April 5, 2026 / 06:36 AM IST

పేదరిక నిర్మూలనే లక్ష్యం: డీఆర్డీఏ పీడీ

KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో బిజినెస్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ) మేనేజ్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం శనివారం జరిగింది. డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. గ్రామీణ మహిళా సంఘాల వ్యాపారాలను ప్రోత్సహించాలని సభ్యులకు సూచించారు. ఏపీఎంలు, సీసీలు, సీఆర్పీలు సమన్వయంతో పనిచేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 06:35 AM IST

జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?

అన్నమయ్య: రాయచోటిలో ఇవాళ నాన్‌వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గి కేజీ రూ.230, స్కిన్‌లెస్ చికెన్ రూ.250గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900గా స్థిరంగా కొనసాగుతోంది వ్యాపారులు తెలిపారు. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నారని వెల్లడించారు.

April 5, 2026 / 06:33 AM IST

మహిళా సాధికారతకు పది సూత్రాలు: మంత్రి

KRNL: మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని శనివారం మంత్రి సత్యకుమార్ తెలిపారు. వివక్షను తొలగించి, మహిళలకు సమాన ఆర్థిక, సామాజిక అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం అన్నారు. గర్భధారణ నుంచి శిశు సంరక్షణ వరకు అండగా ఉంటూ.. జనాభా స్థిరీకరణలో వారిని భాగస్వాములను చేస్తామన్నారు. స్త్రీ శక్తితోనే ప్రగతి సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:30 AM IST

వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై

NDL: ప్రధాన రహదారుల్లో ప్రయాణించే సమయంలో వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంజామల ఎస్సై రమణయ్య హెచ్చరించారు. శనివారం మండలంలోని నొస్సం సమీపంలో ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవర్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

April 5, 2026 / 06:30 AM IST

విశాఖలో పర్యటించనున్న కేంద్ర సమాచారకమిషనర్

VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈనెల 6, 7వ తేదీల్లో సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు భద్రత, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.

April 5, 2026 / 06:28 AM IST

జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన

AKP: నక్కపల్లి మండలం బోయపాడు తీర ప్రాంతంలో జట్టి నిర్మాణానికి స్థలాన్ని మత్స్యశాఖ అధికారులు TDP నాయకులు శనివారం పరిశీలించారు. నక్కపల్లి మండలం తీర ప్రాంతంలో ప్రభుత్వం జట్టీ మంజూరు చేసింది. రూ.32 కోట్ల వ్యయంతో జట్టీ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హోంమంత్రి ఆదేశాల మేరకు అధికారులు నక్కపల్లి మండలంలో తీర ప్రాంతంలో పర్యటించారు.

April 5, 2026 / 06:27 AM IST

మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ

NDL: విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ కాలేజీ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద శనివారం సాయంత్రం లారీ ఢీకొని వృద్ధ దంపతులు గాయపడ్డారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెంటనే స్పందించి, కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

April 5, 2026 / 06:20 AM IST

‘ఈ నెల 30 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుంది’

VZM: ఈ నెల 30 వరకు బొబ్బిలి సబ్‌ డివిజన్లో సెక్షన్‌ – 30 అమలులో ఉంటుందని ఇన్‌ఛార్టి DSP వీర కుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, ధర్నాలు చేపడితే పోలీసులు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామన్నారు.

April 5, 2026 / 06:19 AM IST

శ్రీకాకుళం జిల్లా వాసులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలలో ఆదివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

April 5, 2026 / 06:16 AM IST

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష గడువు పెంపు

ATP: గుంతకల్లులో పాలీసెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణారెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం తమ కళాశాల నందు ఈ నెల 4వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

April 5, 2026 / 06:15 AM IST

అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాటకొండ శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 06:09 AM IST

మున్సిపల్ సమస్యలపై కమిషనర్‌కు వినతి

CTR: పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు పట్టణ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వేసవిలో తాగునీటి కొరత నివారణ, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 06:09 AM IST

నేడు భాకరాపేటలో జల్లికట్టు

TPT: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బీసీ కాలనీలో హరిప్రియ ఆసుపత్రి సమీపంలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఈ జల్లికట్టులో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ఎద్దులను తీసుకువచ్చారు. జల్లికట్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.

April 5, 2026 / 06:08 AM IST