• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు విజ్ఞానయాత్రగా మారిన నగరవనం

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన హిందూ పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యా పర్యటనలో భాగంగా నగరవనం పార్క్, కొండవీడు కోటలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ.. నగరవనం పార్క్‌లోని పచ్చదనాన్ని, వన్యప్రాణులను దగ్గరగా చూసి ఆనందించారు. అనంతరం కొండవీడు కోటకు వెళ్లి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు.

April 4, 2026 / 09:50 AM IST

బహిరంగ ప్రదేశాల్లో డ్రోన్ నిఘా

SKLM: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో సర్వే చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు.

April 4, 2026 / 09:47 AM IST

యుద్ధ నౌక ‘తారాగిరి’ విశేషాలు

AKP: ప్రాజెక్ట్-17A కింద నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ శుక్రవారం నౌకాదళంలో చేరింది. శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే టెక్నాలజీతో రూపొందిన ఈ నౌకలో బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు ఉన్నాయి. 75%కు పైగా స్వదేశీ భాగాలతో దీనిని ముంబైలో నిర్మించారు. అధునాతన రాడార్, సోనార్ సిస్టమ్‌లతో శత్రు కదలికలను ముందే గుర్తించగలదు.

April 4, 2026 / 09:27 AM IST

నిల్వ నీటితో నరకయాతన

VZM: రామతీర్థం గ్రామంలో మురుగు సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన వీధిలో చేపట్టిన రహదారి పనుల కారణంగా కాలువల్లో మట్టి చేరి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల పెరుగుదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 4, 2026 / 09:21 AM IST

డోన్ పాఠశాలలో తేనెటీగల తట్టు తొలగింపు

NDL: డోన్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో తేనెటీగల సమస్యపై శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో తేనెటీగల తట్టును గుర్తించి ప్రత్యేక పద్ధతులతో జాగ్రత్తగా తొలగించారు. ఈ సమయంలో విద్యార్థులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

April 4, 2026 / 09:20 AM IST

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది

CTR: పెద్దపంజాణి మండలం ఆరంజ్ జోన్‌లోకి వెళ్లింది. జిల్లాలో అత్యధికంగా ఆ మండలంలో శుక్రవారం 41.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 40.8, నగరిలో 40.1, శ్రీరంగరాజపురంలో 39.8, తవణంపల్లెలో 39.6, బంగారుపాళ్యంలో 39.0, పలమనేరులో 38.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాలలో 38.7, గంగవరంలో 38.6 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

April 4, 2026 / 09:20 AM IST

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి గాయాలు

KDP: దువ్వూరు మండల పరిధిలోని కడప – కర్నూలు జాతీయ రహదారిలో పెద్ద జొన్నవరం మెట్ట సమీపం నందు శుక్రవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయాలు పాలైన వారిని స్థానికులు 108 వాహనం సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేపట్టారు.

April 4, 2026 / 09:15 AM IST

మంత్రి ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ

ELR: ఉభయ సభల్లో అమరావతి రాజధానికి ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆగిరిపల్లి మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అలాగే ‘మన రాజధాని మన అమరావతి’ అంటూ జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 09:15 AM IST

ఆలూరుకు తుంగభద్ర నీటి విడుదల

KRNL: ఆలూరు నియోజకవర్గ తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు పవర్ కాలువ ద్వారా గుండ్లకెరె చెరువుకు చేరి LLCకి మళ్లిస్తున్నారు. మూడు రోజుల్లో 250 కి.మీ పరిధికి చేరనుంది. విడుదల 15 రోజులు కొనసాగి ఈ నెల 18 లేదా 20వ తేదీకి నిలిపివేయాలని అధికారులు పేర్కొన్నారు.

April 4, 2026 / 09:10 AM IST

ఈ నెల 23 నుంచి గంధం మహోత్సవం

TPT: దొరవారిసత్రం మండలంలో నెలబల్లిలో హజ్రత్ హుసేనమ్మ దర్గలో 56వ గంధ మహోత్సవం ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనుందని దర్గా కమిటీ వెల్లడించింది. 23న (గురువారం) రాత్రి గంధ మహోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, 24న(శుక్రవారం)రాత్రి పాటకచేరి, 25న(శనివారం) రాత్రి జబర్దస్త్ టీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారని వారు తెలిపారు.

April 4, 2026 / 09:10 AM IST

PHCల గ్రేడింగ్‌లో పులిచెర్లకు మొదటి స్థానం

చిత్తూరు జిల్లాలోని 42 PHCలలో పులిచెర్ల PHC మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో A గ్రేడ్ ఏదీ లేకపోగా, కేవలం 3 PHCలు మాత్రమే B గ్రేడ్ సాధించాయి. 23 PHCలు C, 15 D, ఒకటి E గ్రేడ్ పొందాయి. ఫిబ్రవరిలో పులిచెర్లలో 2693 OP, 41 IP, 3376 ల్యాబ్ పరీక్షలు జరగగా, చివరి స్థానంలోని ఆరుమాకులపల్లిలో 504 OP, 132 పరీక్షలు మాత్రమే నమోదయ్యాయి.

April 4, 2026 / 09:05 AM IST

ఉండి పోలీసుల హెచ్చరిక

W.G: ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైనది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉండి పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఇళ్ల బయట, మేడపైన, ఆవరణలో నిద్రిస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని రాత్రి వేళల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందన్నారు. బంగారం, నగదు, సెల్ ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను బయట, తలగడ పక్కన ఉంచకూడదన్నారు.

April 4, 2026 / 09:02 AM IST

నేడు రాజమండ్రిలో జాబ్ మేళా

E.G: రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఉదయం 9:30గంటలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 4, 2026 / 09:00 AM IST

ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు!

NLR: అనంతసాగరం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రెండేళ్ల క్రితం సుమారు 300 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా చాలా మంది ప్లాటును రూ. 3 నుంచి రూ.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటిని కూడా అమ్మేస్తున్నారు. వీటిపై దృష్టి సారించాలని శుక్రవారం స్థానికులు అధికారులను కోరుతున్నారు.

April 4, 2026 / 09:00 AM IST

దొంగతనాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

AKP: వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలమంచిలి పట్టణ ఎస్సై సావిత్రి తెలిపారు. శుక్రవారం పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆటోలో దొంగతనాలపై ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోవాలన్నారు. బంధువుల ఇళ్లకు వెళ్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

April 4, 2026 / 08:49 AM IST