• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎయిర్‌పోర్ట్ పేరుతో విధ్వంసం వద్దు: CPM

SKLM: కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షన శనివారం పలాసలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూమిపైన ఉపాధి పొందుతున్న ప్రజలకు భూమి నుంచి వెళ్లగొడితే ఈ ప్రాంతమంతా నాశనం అయిపోతుందని వారు పేర్కొన్నారు.

April 11, 2026 / 03:56 PM IST

తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు ఆయనను దుశ్శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

April 11, 2026 / 03:56 PM IST

కిషన్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ASR: డుంబ్రిగూడ మండలం పనసపుట్ గ్రామంలో కిషన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వంతల ఆనందరావును కాంగ్రెస్ శ్రేణులు సన్మానించారు. అనంతరం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గంగాధర్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

April 11, 2026 / 03:54 PM IST

పూలే విగ్రహానికి ఎమ్మెల్యే నివాళి

GNTR: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని హిందూ కళాశాల వద్ద ఉన్న పూలే విగ్రహానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష నిర్మూలన, మహిళా సాధికారత కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

April 11, 2026 / 03:51 PM IST

పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి..!

ELR: సుమారు రెండు నెలల క్రితం మన్యం వాసులను గడగడలాడించిన పెద్దపులి తిరిగి మళ్లీ పోలవరంలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులికి గతంలో జూలో అమర్చిన రేడియో ట్రాకింగ్ సిస్టం ద్వారా దాని ఉనికి గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖాళీ చేయబడిన నిర్వాసిత ప్రాంతం వాడపల్లి సమీపంలో సంచరిస్తున్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 11, 2026 / 03:30 PM IST

వసతి గృహాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో CSR నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో రూ.15 లక్షల వ్యయంతో మరమ్మతు పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ ప్రతినిధులు రాజేశ్, దేవరాజులను శనివారం ఆయన సన్మానించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పారిశ్రామిక సంస్థలు సహకరించాలని కోరారు.

April 11, 2026 / 03:30 PM IST

జిల్లా ప్రజలు.. జర జాగ్రత్త..!

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి చాలా ప్రాంతాల్లో 40°C పైగా నమోదయ్యాయి. వచ్చే రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని సూచించింది. నీరు ఎక్కువగా తాగడం, తలపై కవర్లు వాడటం, చిన్న పిల్లలను ఎండకు దూరంగా ఉంచాలని హెచ్చరించింది.

April 11, 2026 / 03:30 PM IST

బనవాసిలో టెక్స్‌టైల్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న MSME ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ పార్క్‌ను MLA బి.వి. జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమని పేర్కొన్నారు. పార్క్ స్థాపన ద్వారా చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

April 11, 2026 / 03:30 PM IST

‘వ్యవసాయ రంగానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి’

W.G: వ్యవసాయ రంగంలో స్థిరీకరణ నిధి ద్వారా రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి అన్నారు. శనివారం పెంటపాడు (M) జట్లపాలెం, కస్సా పెంటపాడు, యానాలపల్లి, దర్శిపర్రు, అలంపురంలో రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఏలూరులో జూన్ 3, 4, 5వ తేదీల్లో జరగనున్న రైతు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

April 11, 2026 / 03:30 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన కొండయ్య

BPT: చీరాల పట్టణంలోని కొత్తపేట మూడు రోడ్ల సెంటర్‌లో కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చలివేంద్రం అనేది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, మనసులను కలిపే మానవత్వపు చిహ్నం. ఒక గ్లాస్ నీరు కూడా ప్రాణాన్ని కాపాడగలదు” అని పేర్కొన్నారు.

April 11, 2026 / 03:27 PM IST

PGRS నిర్వహించిన ఎమ్మెల్యే

విజయనగరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు.

April 11, 2026 / 03:26 PM IST

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

PLD: మాచర్ల పట్టణంలోని వడ్డెరపాలెంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నూతన పాలకమండలి సమావేశంలో పాల్గొని సభ్యులు చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాగద్వేషాలకు అతీతంగా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు.

April 11, 2026 / 03:25 PM IST

రోడ్డు మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: చందర్లపాడు మండలంలో నందిగామ-పొక్కునూరు రోడ్డు మరమ్మతు పనులకు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. మొత్తం రోడ్డు మెరుగుదల పనులకు రూ.280 లక్షలు అంచనా వేయగా, అదనపు ప్రణాళిక కింద నిధులు మంజూరు చేయబడ్డాయన్నారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తెలిపారు.

April 11, 2026 / 03:23 PM IST

భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వరుని గానామృతం

GNTR: తెనాలి బాలాజీరావు పేటలో నిర్మాణ దశలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద శనివారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఏడుకొండల స్వామికి 7 శనివారాలు కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 11, 2026 / 03:20 PM IST

పుట్టపర్తిలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. టెకులోడు ఎంజేపీ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినుల ప్రతిభను అధికారులు మెచ్చుకున్నారు.

April 11, 2026 / 03:03 PM IST