• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ

VZM: జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెర్లాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను, కార్యాలయ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయ పరిధిలో ఆదాయం తక్కువగా ఉండడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

April 22, 2026 / 08:41 AM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ RTC జోనల్ ఛైర్మన్

అన్నమయ్య: నందలూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌లో జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మాజీ RTC జోనల్ ఛైర్మన్ యెద్దల సుబ్బరాయుడు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 22, 2026 / 08:40 AM IST

30న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

KDP: ఈ నెల 30న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు RTC RM గోపాల్ రెడ్డి తెలిపారు. ఒక్క రాజంపేట డిపో మినహా అన్ని డిపోల నుంచి ఒక్కో సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. కడప నుంచి రూ.1044, బద్వేలు రూ.1282, మైదుకూరు రూ.1201, ప్రొద్దుటూరు రూ.1273, పులి వెందుల రూ.1242, జమ్మలమడుగు రూ.1238 చొప్పున టిక్కెట్ల ధరలను నిర్ణయించామన్నారు.

April 22, 2026 / 08:27 AM IST

జిల్లాలో చీనీ ధరలకు రెక్కలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల మొదటి వారంలో టన్ను ధర రూ.23 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.40 వేలకు చేరింది. తోటల వద్దే వ్యాపారులు టన్ను రూ.50 వేలకు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్‌కు కాయల రాక తగ్గింది. మంగళవారం కేవలం 525 టన్నుల దిగుమతి మాత్రమే జరిగినట్లు ఇన్‌ఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.

April 22, 2026 / 08:24 AM IST

30 నెలలుగా జీతాలు లేవని కలెక్టర్‌కు పిర్యాదు

కోనసీమ: జిల్లాలో ఎంపీపీలు, ఎంపీటీసీలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని మంగళవారం కలెక్టర్ మహేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అంబాజీపేట, అల్లవరం ఎంపీపీలు దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఇళ్ల శేషారావు కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, దీనిపై తక్షణం స్పందించాలని వారు కోరారు.

April 22, 2026 / 08:12 AM IST

ఏల్చూరిలో చాపల చెరువు వేలం పాట వాయిదా

బాపట్ల: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరి గ్రామంలో నిర్వహించాల్సిన చేపల చెరువు బహిరంగ వేలం వాయిదా పడింది. అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వేలం నిర్వహణకు సంబంధించి తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

April 22, 2026 / 08:09 AM IST

మద్యం మత్తులో యువకుడిపై దాడి

ప్రకాశం: పొదిలి మండలం ఏలూరు గ్రామంలో మద్యం మత్తులో మంగళవారం రాత్రి బీహార్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు హుస్సేన్ అనే వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో హుస్సేన్‌కి తీవ్ర గాయాలు కావడంతో పొదిలి ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2026 / 08:08 AM IST

ఈ నెల 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్: సీడీపీవో

ASR: కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం హాజరు కావాలని సీడీపీవో ఎల్. దేవమణి మంగళవారం తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం ఉదయం 11గంటలకు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.

April 22, 2026 / 08:07 AM IST

దొంగతానానికి వెళ్లి షాక్‌తో మృతి

VZM: సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం సమీప మామిడితోటలో సోమరాజుపేటకు చెందిన భాస్కరరావు మృతి చెందిన ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న వేకువజామున తోటలో నిరుపయోగంగా ఉన్న మూడు విద్యుత్ స్థంభాల తీగలను దొంగిలించిన అతడు, పక్కనే విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు కత్తిరించే సమయంలో షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు.

April 22, 2026 / 08:05 AM IST

ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై కమీషనర్ సమీక్ష

VZM: బొబ్బిలిలోని పైడితల్లి, పోలమాంబ అమ్మవార్ల సిరిమానోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి సంభందిత అదికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎండల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో వాటర్‌ పాయింట్లు, ఏరియా వైజ్‌ టీములతో క్లీనింగ్‌ పర్యవేక్షణ, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

April 22, 2026 / 08:04 AM IST

పూతలపట్టులో లారీ ప్రమాదం

CTR: పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వైపు లారీ బయల్దేరింది. ముందు వెళ్తున్న వాహనం బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తలకు గాయం కావడంతో అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సింది.

April 22, 2026 / 08:04 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి రూ.10000 జరిమానా

AKP: పాయకరావుపేటలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి ఎలమంచిలి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు సీఐ అప్పన్న తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న పి. వెంకటరమణపై కేసు నమోదు చేసి ఎలమంచిలి కోర్టులో మంగళవారం హాజరు పరిచామన్నారు. ముద్దాయి జరిమానా కట్టలేనందున 6 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఎలమంచిలి సబ్ జైలుకు తరలించామన్నారు.

April 22, 2026 / 08:02 AM IST

ట్రాఫిక్‌ సమస్యలకు ఏఐ టెక్నాలజీ

VSP: విశాఖ‌లో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ యోచిస్తున్నారు. గతంలో పోలీసుల ప్రతిపాదనపై ఐదు చోట్ల పైలట్‌ ట్రయల్‌ నిర్వహించిన ఈ ప్రాజెక్టు అనివార్య కారణాలతో నిలిచిపోయిందని తెలిపారు.

April 22, 2026 / 08:02 AM IST

నేడు పారిజాత గిరిలో తిరునక్షత్ర వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం భగవద్ రామానుజాచార్య తిరునక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, అనంతరం తదియారాధన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

April 22, 2026 / 07:59 AM IST

జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

E.G: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు మార్చి నెల జీతం వెంటనే చెల్లించాలని కొవ్వూరులో మంగళవారం ధర్నా నిర్వహించారు. CITU పిలుపుమేరకు పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపివేసి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు భూపతి రవీంద్ర అధ్యక్షతన నిరసన చేపట్టారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే పారిశుద్ధ్య పనులు ఆగిపోతాయని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరారు.

April 22, 2026 / 07:52 AM IST