• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

63వ రోజుకు చేరిన దళిత రైతుల పోరాటం

AKP: రాంబిల్లి మండలం పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 63వ రోజుకు చేరుకుంది. గత ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నందుకు నిరసనగా పోరాటం కొనసాగిస్తున్నారు. విదసం రాష్ట్ర కన్వీనర్ బి. వెంకట్రావు మాట్లాడుతూ.. అధికారులు తప్పుడు నివేదిక రూపొందించి దళితుల భూములను కాజేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు.

April 6, 2026 / 06:14 PM IST

గుత్తిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ATP: గుత్తిలో సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకప్ప ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ బీజేపీనే అని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా బీజేపీ గుర్తింపు పొందిందని తెలిపారు.

April 6, 2026 / 06:10 PM IST

బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి: ASP

సత్యసాయి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (ASP) అంకిత సురాన బాధితుల నుంచి 49 అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్ మోసాలపై వచ్చిన ఫిర్యాదులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 06:00 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం వివరాలు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కలిసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.2,06,3690 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 06:00 PM IST

అల్లూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన

NTR: వీరులపాడు మండలం అల్లూరులో సోమవారం నాడు రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

April 6, 2026 / 06:00 PM IST

నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత: ఎమ్మెల్యే

E.G: రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక “జలధార” కార్యక్రమం కోరుకొండలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో MLA బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే నినాదంతో రైతుల పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం ముఖ్య ఉద్దేశం అన్నారు.

April 6, 2026 / 06:00 PM IST

సమ్మర్ కిట్స్‌ను అందజేసిన ఎస్పీ

VZM: జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు బ్యాగు, క్యాప్, వాటర్ బాటిల్‌తో కూడిన సమ్మర్ కిట్స్‌ను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఇవాళ పంపిణీ చేశారు. వేసవి కాలం అంతా మజ్జిగ, కూలింగు వాటర్, ఎలక్ట్రోలర్, గ్లూకోజ్ పౌడర్‌ను ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ రోజూ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 06:00 PM IST

‘మావిగన్‌కు మద్దతు పెరుగుతోంది’

VSP: అమరావతి అభివృద్ధి, అవినీతి అంశాలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్‌ నేత కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘మావిగన్’ అనే అభివృద్ధి కారిడార్ ప్రతిపాదనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని, జగన్‌ మాటల ప్రభావం స్పష్టమైందన్నారు. అమరావతిపై భారీ ఖర్చులు పెట్టినా పూర్తి చేయడానికి టైమ్ బాండ్ లేకపోవడం ప్రశ్నార్థకమని విమర్శించారు.

April 6, 2026 / 05:52 PM IST

ముగిసిన సీఎం జిల్లా పర్యటన

ATP: యాడికిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘జలధార’ పథకం ప్రారంభించి, సాగునీటి సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం వేములపాడు హెలిప్యాడ్ నుంచి విజయవాడకు ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.

April 6, 2026 / 05:50 PM IST

నెల్లూరు నగరపాలక సంస్థలో స్వచ్ఛత వారోత్సవాలు

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛత వారోత్సవాలు నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అశోక్ సమక్షంలో కమిషనర్ వై.ఓ నందన్ అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ ప్రయాణం, ప్లాస్టిక్ నివారణ, మొక్కలు నాటడం, వ్యర్థాల పునర్వినియోగం వంటి పర్యావరణ హిత చర్యలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 05:50 PM IST

‘PGRS ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి’

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన 114 ఆర్జీలపై ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును అత్యధిక ప్రాధాన్యతతో, చట్టపరిధిలో నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశించారు.

April 6, 2026 / 05:49 PM IST

‘మంచినీటి కొరత నేటితో తీరనుంది’

W.G: ఉండి మండలం, వాండ్రం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సగంపైగా పూడిపోయి ఉన్న మంచినీటి చెరువును బాగు చేసి, చెరువు చుట్టూ చక్కని వాకింగ్ ట్రాక్ వేశారు. దీనిని సోమవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న మంచి నీటి కొరత నేటితో తీరనుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

April 6, 2026 / 05:47 PM IST

రేపు వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల పరిశీలన

ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 7న సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జూలై-ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీటి విడుదల లక్ష్యంగా పనుల పురోగతిని పరిశీలించనున్నారు. మంత్రి పర్యటన ఇప్పటికే ఖరారైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

April 6, 2026 / 05:45 PM IST

‘పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా’

E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన 9 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5,16,850 విలువ గల చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు సోమవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిది భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దా దుర్గా ప్రసాద్, కాకర్ల సత్యేంద్ర కూచిపూడి గణపతి, తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 05:40 PM IST

ఉప ముఖ్యమంత్రిని కలిసిన సీఆర్డీఏ కమిషనర్

GNTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమరావతి రాజధాని పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

April 6, 2026 / 05:40 PM IST