బాపట్ల: సంతమాగులూరు మండలంలోని పుట్టవారిపాలెం గ్రామ పరిధిలోని పాతూరులో ఐదు పొట్టేళ్లను రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన కంచర్ల శ్రీను అనే వ్యక్తి పొట్టేళ్లను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు. వీటిని ఇంటి ఆవరణలో కట్టేయగా పొట్టేళ్ల మందలోని ఐదు పొట్టేళ్లను ఎత్తుకెళ్లినట్లు బాధ్యుడు చెప్పాడు. వాటి విలువ లక్ష రూపాయలు ఉంటుందన్నాడు.