KDP: లేగ దూడల పెంపకంలో మేలైన యజమాన్య పద్ధతులు పాటించాలని డాక్టర్ భాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆరవీడులో లేగ దూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశ శిబిరం నిర్వహించారు. సంకరజాతి పశువుల పెంపకంపైన రైతులకు అవగాహన కల్పించారు. లేగ దూడలను ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.