కాకినాడ బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ క్లాప్ వాహన డ్రైవర్స్ చేస్తున్న ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. వాహనాల యార్డ్ వద్ద మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడారు. సోమవారం నుంచి పోరాటం మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలియజేశారు.