SKLM: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.