VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబినాయన ఆధ్వర్యంలో 100 మంది విశ్రాంత ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం జరిగింది. ఎమ్మెల్యే బేబినాయన ఒకొక్కరికి సాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. విశ్రాంత జీవితాన్ని చక్కగా గడపాలని ఆకాంక్షించారు.