PLD: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి నారాయణమ్మ ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం వారి గృహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పెదకూరపాడు, నరసరావుపేట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.