ASR: డుంబ్రిగుడ మండల కేంద్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు గ్రామ సమీపంలో ఉన్న పుట్టలో బెల్లం, తాటి గుజరు, పాలు, గుడ్లు నాగదేవతకు నైవేద్యంగా పెట్టారు. అనంతరం కుటుంబ సమేతంగా బాణాసంచా కాల్చి సందడి చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పండగ శోభతో కళకళలాడాయి.