బాపట్ల: కర్లపాలెం మండలం దుండివారిపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామంలోని ప్రజలు, మహిళలు ప్రతిష్టా కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.