KKD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాసు, నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావులు తెలిపారు. టెన్త్ నుండి ఆపైన చదివిన వారందరూ ఈ జాబ్ మేళాకు అర్హులన్నారు. వివరాలకు 90107 37998 నంబర్‌ను సంప్రదించాలన్నారు.