»Ysrtp President Sharmila Prepared For Protest Against Kaleswaram Lift Scam In Delhi Jantar Mantar On Tuesday
Ysrtp Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ.70 వేల కోట్లు దోచేశారు: షర్మిల
ఇండియా(India)లో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల(Scams) కంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్(KCR) అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.

18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కేవలం లక్షన్నర ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని వైఎస్ఆర్టీపీ(Ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు మరెన్నో ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో అడుగడుగునా అవినీతి జరిగిందన్నారు. సుమారు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో కేసీఆర్ పెద్ద డిజైనర్ లాగా ఫీల్ అయ్యాడని, ఒక్క ప్రాజెక్టుపై లక్ష కోట్లు అప్పు చేసి కట్టారని, ప్రజల్ని తప్పు దోవ పట్టించారని వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులన్నీ మెఘా కృష్ణ రెడ్డికి ఇస్తున్నారని, ఆయన ఇచ్చిన ముడుపులన్నీ కూడా ప్రతిపక్షాలకు కూడా అందాయని, అందుకే అందరూ సైలెంట్ గా ఉంటున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్ఆర్టీపీ(Ysrtp) తరపున కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఢిల్లీలో పోరాటం చేస్తానని వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.