»Ysp Mla Vellampally Srinivas Rao Said Janasena President Pawan Kalyan Has No Love For Tdp Leader Chandrababu
Vellampalli Srinivasa Rao: చంద్రబాబు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు!
అక్రమాలకు, అవినీతికి పాలుపడ్డారు కాబట్టే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు అంటే ఇష్టం లేదని, ఆయన పోతే పార్టీని లాక్కుందామనే ఆలోచనలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
YSP MLA Vellampally Srinivas Rao said Janasena president Pawan Kalyan has no love for TDP leader Chandrababu.
Vellampalli Srinivasa Rao: స్కిల్ డెవలప్మెంట్(Skill development) స్కాం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు(Vellampalli Srinivasa Rao) తీవ్ర విమర్షలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఆయన అంటే ఎలాంటి ప్రేమ లేదని అన్నారు. బాబుకు ప్రైవేటు వైద్యం కావాలని జనసేన అధినేత ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. పవన్ షూటింగ్స్ చేసుకుంటూ.. సంతోషంగా ఫామ్ హౌస్లో ఉంటున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతాడా.. టీడీపీని జనసేనలో ఎప్పుడు కలుపుకుందామా అని ఆత్రం తప్ప.. ఆయన మీద ఎలాంటి అభిమానం లేదని వ్యాఖ్యనించారు.
వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీకి అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఈరోజు టీడీపీ శ్రేణులు చేసిన నిరసనలో భాగంగా చేతులకు తాళ్లతో సంకేళ్లు వేసుకోవడంపై విమర్షలు గుప్పించారు. వారికి కూడా సంకేళ్లు వేయాలని పిలుస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. బాబు అరెస్టుపై చేస్తున్న నిరసనలకు ప్రజల నుంచి స్పందన లేదన్నారు. చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ద్వారా కోర్టు పరిధిలో ఉన్నారన్నారు. కోర్టు పరిధిలోకి వెళ్లాక ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదు, తప్పుడు మనిషిని అన్నారు. తాజాగా ఆయనకు ఉన్నరోగాలు బయటపడుతున్నాయని, కుటుంబమే వాటిని ప్రచారం చేస్తుందని అన్నారు.