»Will Stay In Pithapuram Will Take A House Here Pawan Kalyan
Pawan Kalyan: పిఠాపురంలోనే ఉంట.. ఇక్కడే ఓ ఇల్లు తీసుకుంట
జనసేన పార్టీని గెలిపించండి రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం పరిధిలో మొత్తం 54 గ్రామాలు ఉన్నాయని వాటిలో ఏదో ఒక ఊర్లో ఇల్లు తీసుకుంటా అని వెల్లడించారు.
Will stay in Pithapuram.. Will take a house here.. Pawan Kalyan
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో ఇవాళ భారీ చేరికలు జరిగాయి. మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, వివిధ రంగాలకు చెందిన వారు జనసేన కండువ కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని అర్థం చేసుకుని ఇవాళ మనతో నడవడానికి వచ్చిన ఇతర పార్టీల నేతలు, న్యాయవాదులు, మేధావులు, విభిన్న వర్గాల నేతలకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఇక పఠాపురంలో తన గెలుపు టీడీపీ పార్టీ ఇంఛార్జీ ఎస్వీఎస్ఎన్ వర్మ చేతుల్లో పెట్టానని అన్నారు.
పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీని గెలిపించండి రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక ఊరిలో ఇల్లు తీసుకుంటానని తెలిపారు. పగిలేకొద్దీ పదునెక్కేది గ్లాసు.. గ్లాసు గుర్తుకు ఓటేయండి, జనసేనను గెలిపించండి అని పిలుపునిచ్చారు. వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. అది ఓడిపోయే పార్టీ అని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.