ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలకు అభర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీలో నిలుస్తున్నారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. వాడీవేడీగా సాగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) సైతం కదం తొక్కింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. 117 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం. మంగళవారం అధికారికంగా ఈ జాబితాను ప్రకటించనున్నట్లు ఏపీసీసీ వైఎస్ షర్మల పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ, కూటమి పార్టీలు తమ అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు.
సీనియర్ నేత, మాజీ పీసీసీ రఘువీరా రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో తాను పోటీ చేయనని, కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని రఘువీరారెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కాకినాడ నుంచి పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్ర రాజు పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక రేపు మొత్తం అభ్యర్థులను ప్రటించనున్నట్లు షర్మిల చెప్పడంతో ఆశవాహులు ఎదురుచూస్తున్నారు.