ఒంటరిగా రా.. ఒంటరిగా రా.. అంటున్నారు. నేను ఒంటరిగానే వస్తానో, కూటమి ద్వారా వస్తానో.. ఎదైతే మీకెందుకు.. రావడం మాత్రం పక్కా.. ఈ సారి అసెంబ్లీకి వస్తా.. సీఎం పోస్టు సంగతేందో తేలుస్తా.. అంటూ సత్యదేవుని సన్నిధి నుంచి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. కత్తిపూడి (Kattipudi) సభలో సీఎం పదవిపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ (Janasena party)అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం అన్నవరం క్షేత్రం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు(Prattipadu)నియోజకర్గంలోని కత్తిపూడి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయాక…
ముఖ్యమంత్రి పదవీస్వీకార ఉత్సవానికి నన్ను కూడా ఆహ్వానించారు. దాంతో ఆ రోజున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాని పవన్ అన్నారు. ఆ రోజున సీఎంకి ఫోన్ లో ఒక్కటే చెప్పాను… చాలా పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం. మీ పర్సనల్ విషయాల జోలికి రాకుండా, ఏదైనా విధాన పరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం… మీ వైపు నుంచి తప్పులు లేకుండా చూస్కోండి అని చెప్పాన్నారు. మీకు 151 మంది ఎమ్మెల్యే (MLAS)లు, పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చారంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ సీఎంతో ఎంతో సహృదయతతో మాట్లాడాను. కానీ నా కళ్ల ముందు తప్పులు జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలం? రాజకీయ పక్షంగా అది మా బాధ్యతని ఆయన అన్నారు. భగత్ సింగ్(Bhagat Singh), చేగువేరా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను” అని పవన్ కల్యాణ్ వివరించారు.