NLR: గిరిజనుల దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని సర్వేపల్లి MLA సోమిరెడ్డి అన్నారు.ముత్తుకూరు నేలటూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఓ గిరిజన కుటుంబం రిక్షాపై పిల్లల్ని తీసుకెళ్తూ కనిపించింది.సోమిరెడ్డి ఆగి వారితో మాట్లాడారు. ఆధార్ కార్డు లేనందున పిల్లల్ని స్కూల్కు పంపలేదని వారు చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. సంబంధిత సిబ్బందిని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.