డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక వీరాభిమానిగా.. బాలయ్యను తెరపై ఎలా చూపించాలో.. అలా చూపించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అఖండ, అన్‌స్టాపబుల్ జోష్‌లో ఉన్న బాలయ్యతో పాటు.. ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపాడు వీరసింహారెడ్డి. దాంతో సంక్రాంతికి థియేటర్ల వద్ద మాస్ జాతర జరిగింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర వీరసింహుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్‌తో ఊచకోత కోస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ అయిన వీరసింహారెడ్డి.. అఖండ తర్వాత 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు అఖండ చిత్రం అందుకున్న టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి కేవలం 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. దీంతో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం వీరసింహారెడ్డి సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సెలబ్రేషన్ మూడ్‌లో వీరసింహుని విజయోత్సవం పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించబోతున్నారు. జనవరి 23న, సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్స్‌లో ఈ వేడుక జరగనుంది. దీనికి చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానున్నారు. ఇకపోతే.. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటించగా.. కన్నడ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డిని నిర్మించారు.