మైలవరం తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల లో టీడీపీ సానుభూతిపరులు ఉన్నారని, వారిని తక్షణమే తొలగిస్తామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో తెలుగు దేశం పార్టీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామని చెప్పారు. వాళ్లే మున్ముందు మారుతారు అనే ఉధ్యేశ్యంతో… వైసీపీకి అనుకూలంగా తయారు అవుతారు అనే అభిప్రాయంతో ఇప్పటి వరకు వేచి చూశామని చెప్పారు. టీడీపీ సానుభూతిపరులైన వాలంటీర్లలో కొంతమంది మారారని, మరికొందరు మారలేదని అన్నారు. మారనటువంటి వాలంటీర్లను స్థానిక నేతలు గుర్తించి చెపితే వారిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు.
కాగా కొద్ది రోజుల క్రితం వసంత పార్టీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గం పైన ఇతరుల పెత్తనంపై ఆయన అసంతృప్తిని గుర్తించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆయన్ను పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత చల్లబడిన ఆయన… జగన్ తోనే ఉంటానని ప్రకటించారు. మరి పాతిక ముప్పై సంవత్సరాలు తనతో నడవాలని జగన్ నాకు చెప్పారని వెల్లడించారు.