Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి... జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం.
టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి… జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం. కావాలంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దాంతో వైస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు.. టీడీపీ వాళ్లు కూడా జగనే మరో సారి సీఎం కావాలని కోరుకుంటున్నారు.. ఇది మా జగనన్న పని తీరు.. ఆయనపై వారికున్న నమ్మకం అంటూ.. అనిత మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదలు ప్రతి దాంట్లో ఏపీని నంబర్ వన్‌గా నిలిపిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే పరిస్థితులు మారుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పొరపాటున.. కలలో కూడా ఊహించుకోవద్దు.. జగన్ సీఎం కాకూడదు అంటూనే.. మళ్లీ జగన్‌ను సీఎం చేసే బాధ్యత మన మీదే ఉందంటూ.. వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.