నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు వెల్లడించింది.
భక్తులు ఈవిషయాన్ని గమనించి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో కట్టుబట్టలతోనే మూడు మునకలు వేయాలి. ఆ తర్వాత తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. సుప్రభాత సేవ మొదలైన తర్వాత అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు.