టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అన్నమయ్య జిల్లా అంగుళ్లు(Angullu)లో తనను చంపాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. తనపై హత్యాయత్నానికి పోలీసులు (Police) కూడా సహకరించారని ఆరోపించారు.తనతోపాటు తన క్యాడర్పైనా దాడులు చేస్తున్నారని తమని చంపి రాజకీయాలు చేస్తారా ? అని చంద్రబాబు నిలదీశారు. ముదివేడు మండలంలోని అంగల్లు గ్రామంలో ఇటీవల చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చి అక్కడి స్థానిక టీడీపీ (TDP) కార్యకర్తలను, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన బి.ఆర్ ఉమాపతి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో ఏ1 గా నారా చంద్రబాబు నాయుడిని చేర్చగా, ఏ2 మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma)ఉన్నారు. వీరితో పాటూ మరో 18 మందిని ఎక్యూస్డ్ గా పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 79 /2023 120బి 147 145 153 307 115 109 323 324 506 రెడ్ విత్149 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ తెలిపారు.పుంగనూరులో వైసీపీ నేతలు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు? పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. వందలాది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారన్నారు. ఘటనాస్థలిలో లేని వారిపైనా కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు సైతం అమానుషంగా వ్యవహరించారని. అందుకే అక్రమ కేసులు, దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాను. అసమర్థనాయకుడు సీఎం జగన్ (CMJAGAN) అయితే.. వ్యవస్థలు ఇలానే ఉంటాయి’’ అని చంద్రబాబు మండిపడ్డారు.