»Womans Account Andhra Pradesh Village Volunteer Who Stole1 Lakh 70 Thousand
Volunteer: మహిళ ఖాతా నుంచి రూ.లక్షా 70 వేలు కాజేసిన వాలంటీర్
ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.
woman's account Andhra Pradesh village volunteer who stole1 lakh 70 thousand
volunteer: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఓ మహిళా బ్యాంక్ ఖాతా నుంచి గ్రామ వాలంటీర్(village volunteer) భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు. అలస్యంగా విషయం తెలుసుకున్న బాధిత మహిళా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో కొట్ర నాగమణి అనే ఒంటిరి మహిళ నివాసం ఉంటుంది. గ్రామంలో నమ్మకంగా ఉంటున్న వాలంటీర్ తన వేలిముద్ర ద్వారా ఆమె ఖాతా నుంచి రూ.లక్షా 70 వేలు కాజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రతిపక్షాలు విమర్షలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండం గమనార్హం. నిజానికి ముసలి వాళ్లకు, చేతకాని వాల్లకు చేయుతగా ఉంటుందనుకున్న ఈ వ్యవస్థ వారి పాలిట శాపంగా మారుతున్న సందర్భాలు చూస్తున్నాము. ఈ మధ్య ఓ వృద్దురాలని హతమార్చి డబ్బులు కాజేసిన వాలంటీర్ వార్తల్లో నిలిచాడు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యాలు తీసుకుంటుందనేది ప్రజల్లో ఆసక్తిగా మారింది. ఇలాంటి పనుల వల్ల ఇతర వాలంటీర్లపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుండి రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీర్
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్ర నాగమణి అనే మహిళ వేలిముద్ర ద్వారా ఆమె ఖాతానుండి వాలంటీర్ డబ్బులు కాజేసాడు, మోసపోయిన మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. pic.twitter.com/bUvVrB4uug