»They Spoiled Me Ram Gopal Varmas Tweet Went Viral
Ram Gopal Varma : వాళ్ళు నన్ను చెడ గొట్టారు.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుస ట్వీట్ లు చేశాడు. విజయవాడ (Vijayawada)లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదినాడు. ఇక బిటెక్ పాస్ అయిన దగ్గర నుంచి వర్మ తన డిగ్రీ తీసుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వెళ్లిన వర్మకి.. యూనివర్సిటీ సత్కరించడమే కాకుండా తన బిటెక్ డిగ్రీని కూడా వర్మకి అందించారు.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుస ట్వీట్ లు చేశాడు. విజయవాడ (Vijayawada)లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదినాడు. ఇక బిటెక్ పాస్ అయిన దగ్గర నుంచి వర్మ తన డిగ్రీ తీసుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వెళ్లిన వర్మకి.. యూనివర్సిటీ సత్కరించడమే కాకుండా తన బిటెక్ డిగ్రీని కూడా వర్మకి అందించారు.”బిటెక్ పాస్ అయిన 37 ఏళ్ళ తరువాత నా డిగ్రీ అందుకోవడం చాలా థ్రిల్ గా ఉంది. 1985 నుంచి ఎప్పుడు ఈ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పై ఆసక్తి కలగలేదు. థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ” అంటూ తన సెరిటిఫికేట్ షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ తో పాటు మరికొన్ని ట్వీట్స్ కూడా చేశాడు. ఆ ట్వీట్స్ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.బాగా చదువుకున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్ (Professors) మధ్య బాగా చదువుకొని నేను అంటూ ప్రొఫిసర్స్ తో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఇక గెస్ట్ గా వెళ్లిన తనని వైస్ ఛాన్సలర్ ప్రొఫిసర్ రాజశేఖర్ పూల గుచ్చంతో గౌరవిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఈ గౌరవానికి నేను అర్హుడిని కాదన్నా, ఆయన వినకుండా గౌరవించారు అంటూ చెప్పుకొచ్చాడు.ఇక చివరిగా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యిన ఫోటోని షేర్ చేస్తూ.. నేను వాళ్ళని చెడ గొట్టడానికి ట్రై చేశా. కానీ వాళ్ళే నన్ను చెడ గొట్టారు అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ గోపాల్ వర్మ.. బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ (BTech Civil Engineering)సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు.
Super thrilled to receive my B tech degree today 37 years after I passed , which I never took it in 1985 since I wasn’t interested in practicing civil engineering..Thank you #AcharyaNagarjunaUniversity 😘😘😘Mmmmmmuuaahh 😍😍😍 pic.twitter.com/qcmkZ9cWWb