వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది నేరచరితులేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మొత్తం 408 క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. సీఎం జగన్ (CM JAGAN) పైనే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయని, ఆయనపై మొత్తం 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ న్యాయ కార్యకలాపాల ఖర్చులు 70 శాతం పెరిగాయని చంద్రబాబు అన్నారు. తెలిసింది గోరంత మాత్రమేనని, తెలియాల్సింది చాలా ఉందని అన్నారు. ఇలాంటి నేరస్తులు ప్రజలకు న్యాయం చేస్తారా? అంటూ విమర్శించారు.