అధికార పార్టీ వైఫల్యం.. సీఎం జగన్ (Jagan) నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై (Telugu Desam Party) మళ్లుతోంది. ఈ క్రమంలోనే టీడీపీకి (TDP) అనూహ్య ఆదరణ లభిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో (Nellore District) ఆ పార్టీకి ఫుల్ జోష్ వచ్చేసింది. సీఎం జగన్ ను ధిక్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రానున్నారు. దీనికి నిదర్శనమే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) చేసిన వ్యాఖ్యలు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే (Venkatagiri) ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయగిరిలో (Udayagiri) ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నెల్లూరు జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు (MLAs) టీడీపీ కైవసం చేసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేస్తా. ఎంపీ (MP) స్థానానికి పోటీ చేయను’ అని ప్రకటించారు. ‘ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండవచ్చు. ఎన్నికల ముందు 60 శాతం టీడీపీలోకి చేరుతారు. అధికారం ఉండడంతో కొంతమంది వారి పనుల రీత్యా తాత్కాలికంగా వైసీపీలో (YCP) ఉంటున్నారు’ అని పేర్కొన్నారు.