»Tdp National General Secretary Nara Lokeshs Yuvagalam Padayatra Has Completed 200 Days Today
200DaysOfYuvagalam: లోకేష్ జోరు..200 రోజులకు చేరుకున్న యువగళం పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 200 రోజుల పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న లోకేష్ వేరు ఇప్పుడు వేరులా ఆయన మాటతీరు, నడవడిక అన్ని మారాయి. ట్రోల్స్ చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు భయపడే పరిస్థితికి వచ్చింది.
TDP National General Secretary Nara Lokesh's Yuvagalam Padayatra has completed 200 days today.
200DaysOfYuvagalam: యువనేత, తెలుగుదేశం(TDP) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన నాలుగు వేల కిలోమీటర్ల యువగళం(Yuvagalam) పాదయాత్ర నేటికి 200వ రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకెళ్తుతుంది. నాలుగు కిలోమీటర్లు నడిస్తేనే ఎక్కువ అని భావించిన వారికి సమధానంగా అడుగడుగునా జన నీరాజనలతో ఇప్పటి వరకు 2,710 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. ఏ నియోజకవర్గంలో పర్యటించినా జనాదరణ చురగొంటూ, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కుప్పం నుంచి జనవరి 27న మొదలు పెట్టిన ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి (WestGodavari) జిల్లా పోలవరంకు చేరుకుంది. ఈ రెండు వందల రోజులుగా పాదయాత్రలో 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల వరకు మండలాలు, మున్సిపాలిటీలు నారా లోకేష్ కవర్ చేశారు.
మరో రెండు రోజులు పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకర్గాల్లో పర్యటించనున్నారు. ఒకప్పుడు ఆయన మాట్లాడితే ప్రత్యర్థులు విపరీతంగా ట్రోల్స్ చేసేవారు. కానీ ఇప్పుడు పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేసిన ఈ పాదయాత్రలో 64 బహిరంగ సభల్లో పాల్గొనారు. ప్రతి నియోజకవర్గంలోని వైసీపీ(YCP) ఎమ్మెల్యేలపై గట్టి సవాళ్లు విసిరారు. వారు చేసిన అన్యాయాలపై, అక్రమాలపై ఆరోపణలు చేశారు. రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
నాలుగు సంవత్సరాల్లో వైసీపీ చేసిన తప్పులను తెలియజేస్తూ సీఎం జగన్‌తో సహా అనేక మంది సీనియర్ నాయకులపై మాటల యుద్దం చేశారు. సభల్లో ఆయన మాటలను ట్రోల్స్ చేసిన నేతలు పాదయాత్రలో లోకేష్ ప్రసంగాలపై బెంబెలెత్తిపోతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. మిగిలిన పదమూడు వందల కిలో మీటర్ల పాదయాత్రను కూడా విజయంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.