»Ys Sharmila Comments On Telangana Cm Kcr Countdown Become A Started
YS Sharmila: KCRకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పలువురు నేతలు పార్టీలు మారుతుండగా..ఇంకొంత మంది తమ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో YSRTP అధినేత వైఎస్ షర్మిల(ys sharmila) ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila comments on telangana cm kcr Countdown become a started
తెలంగాణ సీఎం KCRకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యిందని YSRTP అధినేత వైఎస్ షర్మిల అన్నారు. ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన క్రమంలో ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమన్నారు. ఆ దిశగానే వైఎస్సార్ బిడ్డగా నిరంతరం సేవ చేస్తానని వెల్లడించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ నేతలతో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. అయితే ఈ మాటల అర్థానికి YSRTP పార్టీ విలీనం.. కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది.