»Ap High Court Is Serious About Tiger Nageswara Rao Teaser Issuance Of Notices
Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్..నోటీసులు జారీ
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ టీజర్ ఇటీవలె విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజర్లో వాడిన పదాలు స్టువర్టుపురం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, దానిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా టీజర్ (Teaser)పై ఏపీ హైకోర్టు (Ap High Court) సీరియస్ అయ్యింది. టీజర్లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రజలను అవమానించేలా ఉందని హైకోర్టు తెలిపింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజం పట్ల బాధ్యత ఉండాలని, ఇలాంటి టీజర్ వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించింది.
మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhisekh Agarwal)కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబై (Mumbai)లోని సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటీషనర్‌కు సూచించింది. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అభ్యంతరాలపై ముంబై సెంట్రల్ బోర్డుకు చెందిన ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageswara Rao) రూపొందుతోంది. అయితే ఈ మూవీ టీజర్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం సీరియస్ అవుతూ నోటీసులిచ్చింది. ఈ మూవీ ఎరుకల సామాజికవర్గ మనోభావాలను కించపరిచేలా ఉందని, స్టువర్టుపురం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చుక్కా పాల్‌రాజ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో పిటీషనర్ తరపున అంకాళ్ల పృథ్వీరాజ్, శృంగారపాటి కార్తీక్ వాదనలు వినిపించగా కోర్టు ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.