mlc bachula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఈ రోజు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుండెపోటు రావడంతో నెలరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై టీడీపీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
mlc bachula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఈ రోజు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుండెపోటు రావడంతో నెలరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేశ్ సహా ముఖ్య నేతలు బచ్చుల అర్జునుడి మృతిపై సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.
బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో కుప్పకూలగా, విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్నారు. బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్టు భావిస్తున్నారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందినవారు. ఆయన బందరు మున్సిపల్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2021లోనూ బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా రమేశ్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ ఇప్పించారు. అత్యవసర శస్త్రచికిత్స (Emergency Surgery) అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. జనవరి-28న మరోసారి గుండెపోటు వచ్చింది. ఈసారి కూడా తమ అభిమాన నేత క్షేమంగా తిరిగొస్తారని అభిమానులు భావించారు.
కరోనా సమయంలో బచ్చులకు రెండుసార్లు వైరస్ (Corona Virus) సోకింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడటం, గుండెపోటు రావడం జరుగుతోందని బచ్చుల అనుచరులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీకి (TDP) దూరమవ్వడంతో గన్నవరం (Gannavaram) బాధ్యతలను బచ్చులకు చంద్రబాబు అప్పగించారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజా సమస్యల పరిష్కారానికై బచ్చుల అర్జునుడు కృషి చేస్తూ వచ్చారు.