»Tdp Leader Nara Lokesh Said That He Learned A Lot About The Inner Ring Road During The Cid Investigation
Nara Lokesh: విచారణలో చాలా విషయాలను తెలుసుకున్నాను
రెండు రోజులు విచారణ చేపట్టారు. కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. విచారణ తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ గురించి అసలు విషయం తెలుసుకున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. తన సమయం ఏపీ సీఐడీ అధికారులు వృథా చేశారని ఆరోపించారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఎద్దేవా చేశారు.
TDP leader Nara Lokesh said that he learned a lot about the Inner Ring Road during the CID investigation
Nara Lokesh: ఇన్నర్ రింగ్( Inner Ring Road) రోడ్డు కేసులో రెండో రోజు సీఐడీ విచారణ ముగిసిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణలో తనకు బాహుబలి సినిమా చూపించారని పేర్కొన్నారు. దాంతో చాలా విషయాల్లో క్లారిటీ వచ్చిందని తెలిపారు. జాతీయ పార్టీ కార్యదర్శిని ఇలా ఆరోపణలతో రెండు రోజుల సమయం వృథా చేశారని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధం లేని తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ అధికారులు చూపించారని వివరించారు.
ముందురోజు తనను 40కి పైగా ప్రశ్నలు అడిగారని, రెండో రోజు కూడా అవే ప్రశ్నలను అడిగారని నారా లోకేష్ చెప్పారు. తన ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్(Heritage) సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి అని పేర్కొన్నారు. హెరిటేజ్ కొనుగోలు చేసిన భూమి, సర్వే నెంబర్లు తనకు తెలుసని ఈ రోజు ఆ పెద్ద స్క్రీన్లో బాహుబలి సినిమా చూపించినట్టు నీట్ గా చూపించారని అన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందని. దీని ద్వారా హెరిటేజ్ కొంత భూమిని కోల్పోతుందని చెబుతూ ఈ విషయం తనకు ఇవాళే తెలిసిందన్నారు. ఇక తనకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించలేదని ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేటని అన్నారు. తన సమయాన్ని రెండు రోజులు వృథా చేశారు అని పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఆధారాలేవీ చూపించలేదని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినని, చాలా పనులు మానుకుని సీఐడీకి సహకరించానని చెప్పారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇక తన తల్లికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అధికారుల దగ్గర ఉన్నాయని, కేసుకు సంబంధం లేని వ్యక్తుల సమాచారం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై వ్యక్తిగతంగా ఫైట్ చేస్తానని లోకేష్ వెల్లడించారు.