TDP General Secretary Lokesh grabbed whose legs in Delhi.. YCP MLA Perni Nani
Perni Nani: నారా లోకేష్(Nara Lokesh)పై పేర్ని నాని(Perni Nani ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu)ను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశామని ప్రచారం చేసుకొని ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఎక్కడున్నాడు? లాయర్లంతా విజయవాడ రోడ్లపై తిరుగుతుంటే, ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు? అని ప్రశ్నించారు. అయినా మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.
25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు?. ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లావు?. స్కామ్‌లో రూ.27 కోట్లు మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నారని నాని వ్యాఖ్యానించాడు. సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ?. దొరకనంత మాత్రాన దొంగ కాకుండా పోరని. మీ నాన్న ఇప్పుడు దొరికారు. తరువాత నువ్వు కూడా అని పేర్కొన్నారు. అప్పుడు వీరప్పన్ చెప్పిన కబుర్లే ఇప్పుడు మీరు చెబుతున్నారు. అంతా నిజాయితీ పరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్డ్ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై ఘాటు కామెంట్లు చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని పవన్ ఉద్దేశించి అన్నారు. అసలు పవన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా అని అడిగారు. పవన్ చెప్పే మాటాల్లో ఎక్కడ కూడా క్లారిటీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పవన్, చంద్రబాబు ఇద్దరే పట్టిపీడిస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు.